మళ్లీ వణికిస్తున్న మహమ్మారి.. ఈసారి బీఎఫ్-7 వేరియంట్
కరోనా పీడ విరగడైందని అనుకునే లోనే మరో వేరియంట్ ఆందోళన పరుస్తోంది. చైనాలో భారీగా పెరిగిన కరోనా కేసులు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి

విధాత: కరోనా పీడ విరగడైందని అనుకునే లోనే మరో వేరియంట్ ఆందోళన పరుస్తోంది. చైనాలో భారీగా పెరిగిన కరోనా కేసులు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. తాజాగా బీఎఫ్-7 వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించాలనే ఆలోచనలో కంపనీలు ఉన్నాయట. ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. రద్దీ ప్రదేశాలైన విమానాశ్రయాలు. బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్‌లు, మెట్రో స్టేషన్‌లలో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది.