Delhi | ఢిల్లీలో కూలిన మ‌త కార్య‌క్ర‌మ వేదిక‌.. ఒకరు మృతి

ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో మతపరమైన కార్యక్రమం కోసం ఏర్పాటుచేసిన జాగ‌ర‌న్ వేదిక ఆదివారం కూలిపోవడంతో ఓ మహిళ మ‌ర‌ణించారు.

Delhi | ఢిల్లీలో కూలిన మ‌త కార్య‌క్ర‌మ వేదిక‌.. ఒకరు మృతి
  • మ‌హిళ మృతి.. 17 మందికి గాయాలు
  • కూలిన మ‌త కార్య‌క్ర‌మ వేదిక‌
  • మ‌హిళ మృతి.. 17 మందికి గాయాలు
  • ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో ఘ‌ట‌న‌

Delhi | విధాత‌: ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో మతపరమైన కార్యక్రమం కోసం ఏర్పాటుచేసిన జాగ‌ర‌న్ వేదిక ఆదివారం కూలిపోవడంతో ఓ మహిళ మ‌ర‌ణించారు. మ‌రో 17 మంది భక్తులు గాయ‌ప‌డ్డారు. మ‌తప‌ర‌మైన‌ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ పంజాబీ గాయకుడు బీ ప్రాక్‌ను నిర్వాహ‌కులు ఆహ్వానించారు. నిర్వాహకులు, వీఐపీల కుటుంబాల కోసం ప్రధాన వేదిక సమీపంలో ఇనుప ఫ్రేమ్‌తో కూడిన ఎత్తైన చెక్క ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటుచేశారు.

ప్లాట్‌ఫారమ్‌పై కూర్చున్న వారితోపాటు మ‌రికొంద‌రు వేదిక‌ను ఎక్క‌డంతో బరువును తట్టుకోలేక అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో వేదిక కుప్పకూలిపోయిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆగ్నేయం) రాజేశ్‌ డియో తెలిపారు. దానిపై కూర్చున్న వారితోపాటు, వేదిక‌కు దగ్గరగా కూర్చ‌న్న‌వారికి కూడా గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఒక మ‌హిళ చ‌నిపోగా, 17 మంది గాయ‌ప‌డ్డార‌ని వెల్ల‌డిచారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించి చికిత్స అందించిన‌ట్టు తెలిపారు. అయితే, ఈ కార్యక్రమానికి ముందస్తు అనుమతి ఇవ్వలేదని చెప్పారు.

ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో తాను ప్రదర్శన ఇస్తున్న వేదిక కూలిపోవడంపై గాయ‌కుడు బీ ప్రాక్ విచారం వ్య‌క్తంచేశారు. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టారు. “నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇలాంటి ఘ‌ట‌న‌ ఎప్పుడూ జరగలేదు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మేనేజ్‌మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి” అని  సూచించారు.

విధాత‌: ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో మతపరమైన కార్యక్రమం కోసం ఏర్పాటుచేసిన జాగ‌ర‌న్ వేదిక ఆదివారం కూలిపోవడంతో ఓ మహిళ మ‌ర‌ణించారు. మ‌రో 17 మంది భక్తులు గాయ‌ప‌డ్డారు. మ‌తప‌ర‌మైన‌ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ పంజాబీ గాయకుడు బీ ప్రాక్‌ను నిర్వాహ‌కులు ఆహ్వానించారు. నిర్వాహకులు, వీఐపీల కుటుంబాల కోసం ప్రధాన వేదిక సమీపంలో ఇనుప ఫ్రేమ్‌తో కూడిన ఎత్తైన చెక్క ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటుచేశారు.