‘పుష్ప’ ఫైరింగ్‌కు.. వార్నింగ్‌కు ఏడాది
విధాత: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లోని విభిన్న కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘పుష్ప ది రైజ్’. అదే సమయంలో మొదటి నుంచి డైరెక్టర్ సుకుమార్‌పై ఓ అపవాదు ఉంది. కేవలం మేథో వర్గానికి అర్థమయ్యే చిత్రాలు మాత్రమే తీస్తాడఅని. ఆయన చిత్రాలు సామాన్య ప్రేక్షకులకు అర్థం కావనే ప్రచారం ఉంది. దాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ‘రంగస్థలం’ నుంచి మార్చుకున్నాడు. ‘రంగస్థలం’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను అద్భుతమైన పాత్రలో చూపించిన ఆయన.. ‘పుష్ప ది […]

విధాత: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లోని విభిన్న కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘పుష్ప ది రైజ్’. అదే సమయంలో మొదటి నుంచి డైరెక్టర్ సుకుమార్‌పై ఓ అపవాదు ఉంది. కేవలం మేథో వర్గానికి అర్థమయ్యే చిత్రాలు మాత్రమే తీస్తాడఅని. ఆయన చిత్రాలు సామాన్య ప్రేక్షకులకు అర్థం కావనే ప్రచారం ఉంది. దాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ‘రంగస్థలం’ నుంచి మార్చుకున్నాడు. ‘రంగస్థలం’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను అద్భుతమైన పాత్రలో చూపించిన ఆయన.. ‘పుష్ప ది రైజ్’లో అల్లు అర్జున్‌తో కలిసి రెచ్చిపోయాడు.
ఆయనలో ఇంత మాసివ్ డైరెక్టర్ కూడా ఉన్నాడా? అని అనిపించేలా ఆ రెండు సినిమాలను ఆయన చిత్రీకరించాడు. ఇక పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ తగ్గేదే లే… అంటూ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు సుకుమార్, అల్లు అర్జున్. ఈ చిత్రం విడుదలై సరిగ్గా ఏడాది పూర్తయింది. పుష్పరాజ్‌గా బన్నీ నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్ ఇలా ఒకటేమిటి భారతీయ సినీ ప్రేక్షకులకు ఒక మాస్ అవతారం ఆవహించేలా చేశారు. సోషల్ మీడియాను హోరెత్తించారు. బాక్సాఫీసు వద్ద కాసులు కురిపించారు. కొత్త కొత్త రికార్డులను సృష్టించారు. అది పుష్పరాజ్ చరిత్ర.
వాస్తవానికి అల్లు అర్జున్ ‘ఆర్య’ చిత్రంతో ఒక మైలురాయి క్రియేట్ చేసుకున్నాడు. దానికి దర్శకుడు కూడా సుకుమారే. ఆ తర్వాత వచ్చిన ‘ఆర్య 2’ పెద్దగా మెప్పించలేదు. దాంతో 10 ఏళ్ల తర్వాత సుకుమార్, బన్నీలు చేతులు కలిపారు. వాస్తవానికి పుష్ప కథను మొదట మహేష్ బాబుకు వినిపించారు. ఆయన కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అంతకు ముందు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ సర్దుబాటు కాలేదంటారు.
కానీ నిజానికి చెప్పాల్సి వస్తే పుష్ప రాజ్ క్యారెక్టర్ మహేష్‌కి ఎలా ఉండేదో తెలియదు గాని బన్నీకి మాత్రం రెడీమేడ్‌గా సూట్ అయింది. ఇంకా సుకుమార్, బన్నీలకు దేవిశ్రీప్రసాద్ కలిస్తే ఆ సౌండ్‌కి బాక్స్ బద్దలు అవ్వాల్సిందే. పుష్ఫ విషయములోనూ అది రుజువైంది. శ్రీవల్లి, ఉ అంటావా మామ, సామి సామి పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసేయ్. 2022లో అంటే ఈ ఏడాదిలో అత్యంత ప్రజాదరణ కలిగిన టాప్ టెన్ సాంగ్స్‌లో ఇవి నిలిచాయి. అంతేకాదు ఆరు బిలియన్‌లను మించి వ్యూస్ సొంతం చేసుకొని అలా చరిత్ర సృష్టించిన తొలి ఇండియన్ ఆల్బమ్‌గా ఈ సాంగ్స్ రికార్డు క్రియేట్ చేశాయి.
డిసెంబర్ 17న పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప ప్రపంచవ్యాప్తంగా 365 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఒక్క హిందీలోనే నెట్ కలెక్షన్స్ 180 కోట్లకు దాటి ఇచ్చింది. 2021 లో విడుదలైన చిత్రాలలో అత్యధిక గ్రాస్‌ను వసూలు చేసిన చిత్రంగా పుష్ప రికార్డు క్రియేట్ చేశాడు. టాలీవుడ్ లో అత్యధిక మంది వీక్షించిన లైక్ చేసిన వీడియో పుష్పరాజ్ టీజర్. ఓటీటీలోనూ పుష్ప అదరగొట్టింది. 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధిక మంది వీక్షించిన మూవీగా నిలిచిపోయింది.
ఇక 2022లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా.. 10 మిలియన్ ప్లస్ ఇన్‌స్టా రీల్స్ క్రియేట్ చేశారంటే పుష్ప మేనియో ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అవార్డుల విషయంలో కూడా మన పుష్పరాజ్ తగ్గేదేలే అన్నాడు. 7 ఫిలింఫేర్ అవార్డులు, మరో ఏడు సైమా అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ ఇలా అన్ని విభాగాల్లోనూ అవార్డులు ముంచెత్తాయి.
ఈ చిత్రంలో పుష్పరాజ్ చేత పలికించిన పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్…. సరుకు ఉంటే పుష్ప ఉండడు… పుష్ప ఉంటే సరుకు ఉండదు… రెండింటినీ కలిపి చూడాలనుకుంటే మీరు ఎవ్వరూ ఉండరు.. నేను ఇక్కడ బిజినెస్‌లో ఏలు పెట్టి కెలకడానికి రాలే…. ఏలేయడానికే వచ్చా తగ్గేదేలే వంటి డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి. ప్రస్తుతం పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా పుష్ప ది రూల్ రాబోతుంది. ఇప్పటికే చిత్రీకరణ మొదలైంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.
కూలీగా జీవితాన్ని మొదలుపెట్టిన పుష్ప ఎర్రచందనం సిండికేట్‌ను లీడ్ చేసే వ్యక్తిగా ఎలా ఎదిగాడు అనేది పార్ట్ వన్‌లో చూపించారు. సీక్వెల్లో శత్రువులైన ఎస్పీ బన్వర్సింగ్ షెకావత్, జాలిరెడ్డి, మంగళం శీను, దాక్షాయిని ల నుంచి పుష్పరాజుకి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? వాటిని ఎలా అధిగమించాడు? అనేది చూపించనున్నారు. ఇందులో చాలా షాక్ తినిపించే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా దట్టిస్తున్నారని సమాచారం. రీసెంట్‌గా సుకుమార్ నోటి వెంట ‘పుష్ప 3’ ఆలోచన కూడా ఉన్నట్లుగా వినబడిందనేలా వార్తలు బయటికి రావడంతో.. మున్ముందు ఇది అంతం లేని ప్రాజెక్ట్‌గా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.