Telangana | కేసీఆర్‌పై వ్యతిరేకత సగానికి పైనే! 50.2% మందిలో జనాగ్రహం

Telangana అత్యంత జనాగ్రహం ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం ఏపీలో జగన్‌పై 35.1% మందిలో కోపం అక్కడి సిటింగ్‌లపై ఆగ్రహం స్కోరు 44.9 అత్యంత ప్రజాదరణ పొందిన సీఎం భగేల్‌ నూటికి 25.4% మందిలోనే ఆగ్రహం ఎన్నికల రాష్ట్రాల సీఎంలపై సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరిలో ఎన్నికలకు వెళుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లాట్‌, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికు ప్రమాద ఘంటికలు మోగుతు న్నామని తాజాగా విడులైన ఒక సర్వే […]

  • By: Somu    latest    Sep 14, 2023 12:25 AM IST
Telangana | కేసీఆర్‌పై వ్యతిరేకత సగానికి పైనే! 50.2% మందిలో జనాగ్రహం

Telangana

  • అత్యంత జనాగ్రహం ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం
  • ఏపీలో జగన్‌పై 35.1% మందిలో కోపం
  • అక్కడి సిటింగ్‌లపై ఆగ్రహం స్కోరు 44.9
  • అత్యంత ప్రజాదరణ పొందిన సీఎం భగేల్‌
  • నూటికి 25.4% మందిలోనే ఆగ్రహం
  • ఎన్నికల రాష్ట్రాల సీఎంలపై సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరిలో ఎన్నికలకు వెళుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లాట్‌, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికు ప్రమాద ఘంటికలు మోగుతు న్నామని తాజాగా విడులైన ఒక సర్వే పేర్కొంటున్నది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఐఏఎన్‌ఎస్‌ సీవోటర్‌ యాంగర్‌ ఇండెక్స్‌ పేరిట సర్వే నిర్వహించగా.. అత్యంత ప్రజాదరణ కలిగినవారిలో ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భగేల్‌ నిలిచారు. సగటున ప్రతి వందమందిలో 25.4శాతం మంది మాత్రమే భగేల్‌పై కోపంతో ఉన్నారని వెల్లడైంది.

ప్రజాగ్రహాన్ని అత్యధికంగా ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు నిలిచారు. ఆయన పట్ల రాష్ట్రంలో 50.2 శాతం మంది ఆగ్రహంతో ఉన్నారని తేలింది. తదుపరి స్థానాల్లో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ (49.2%), ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి (35.1%) ఉన్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్కోరు 27గా ఉండగా.. మిజోరం సీఎం జొరంతంగ స్కోరు 37.1గా ఉన్నది. వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.

ఎన్నికలు జరిగే ఆరు రాష్ట్రాల్లో అత్యధిక ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. అత్యధిక ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రులు ఉన్నారని ఐఏఎన్‌ఎస్‌ వార్తా సంస్థ సర్వేను ఉటంకిస్తూ పేర్కొన్నది. అయితే తెలంగాణలోని సిటింగ్‌ ఎమ్మెల్యేలు అతి తక్కువ ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నారని సర్వే తెలిపింది. సిటింగ్‌ ఎమ్మెల్యేకంటే ఎక్కువ జనాగ్రహాన్ని తెలంగాణ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రులు ఎదుర్కొంటున్నారని వెల్లడికావడం విశేషం.

ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భగేల్‌ పట్ల ప్రజల్లో అతి తక్కువ ఆగ్రహం ఉన్నప్పటికీ.. సిటింగ్‌ ఎమ్మెల్యేలు మాత్రం 44 శాతం ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని సర్వే తెలిపింది. తెలంగాణలో సిటింగ్‌ ఎమ్మెల్యేలపై 27.6 శాతం వ్యతిరేకత ఉండగా.. రాజస్థాన్‌లో 28.3 శాతంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో సిటింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఐఏఎన్‌ఎస్‌-సీ ఓటర్‌ సర్వే వెల్లడించింది. సిటింగ్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత స్కోరు ఇక్కడ 44.9 శాతంగా ఉండటం విశేషం. మిజోరంలో 41.2%, మధ్యప్రదేశ్‌లో 40.1 శాతంగా ఉన్నది.

ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉండగా.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నది. మిజోరంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం మిజో నేషనల్‌ ఫ్రంట్‌ పాలిస్తున్నది. ఇక తెలంగాణలో బీఆరెస్‌, ఏపీలో వైసీసీ అధికారంలో ఉన్నాయి. తాజా సర్వే ప్రకారం బీజేపీ ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బలే ఎదుర్కొన్నబోతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.