పేపర్ లీకులపై.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: మద్ధికాయల అశోక్ ఓంకార్

బాధ్యులను కఠినంగా శిక్షించాలి ఎంసీపీఐయూ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ధికాయల అశోక్ ఓంకార్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్‌సీ రాత పరీక్షల పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎంసీపీఐయూ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయాల అశోక్ ఓంకార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ ఓంకార్ భవన్‌లో జరిగిన అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఏఐఎఫ్డీస్) రాష్ట్రస్థాయి జనరల్ బాడీ సమావేశం రాష్ట్ర […]

  • By: Somu    latest    Apr 07, 2023 11:31 AM IST
పేపర్ లీకులపై.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: మద్ధికాయల అశోక్ ఓంకార్
  • బాధ్యులను కఠినంగా శిక్షించాలి
  • ఎంసీపీఐయూ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ధికాయల అశోక్ ఓంకార్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్‌సీ రాత పరీక్షల పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎంసీపీఐయూ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయాల అశోక్ ఓంకార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శుక్రవారం వరంగల్ ఓంకార్ భవన్‌లో జరిగిన అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఏఐఎఫ్డీస్) రాష్ట్రస్థాయి జనరల్ బాడీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ ఓంకార్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగుల కలలు నాశనమయ్యారన్నారు.

2014 నుంచి ఇప్పటివరకు ప్రతి నోటిఫికేషన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ వస్తున్నప్పటికీ ఉద్యోగ భర్తీ చేపట్టలేదన్నారు. 2018 వరకు పోలీస్ శాఖలలో 29 వేలు ఇతర శాఖలతో కలిపి 36 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశామని రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించిందన్నారు.

అనంతరం 67వేలు అంటూ 94వేల పోస్టులు భర్తీ చేస్తామంటూ ప్రగల్బాలు పలికారని విమర్శించారు. నోటిఫికేషన్లు వేస్తూ వచ్చినప్పటికీ టీఎస్పీఎస్సీలో పరీక్ష పత్రాలను పథకం ప్రకారం లీకెజ్ చేస్తూ నిరుద్యోగులతో ఆటాడుకుంటుందని విమర్శించారు. సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని, దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు.

పదవ తరగతి పరీక్షలూ లీకేజీ

ఈనెల 3నుంచి 10వ తరగతి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మొదటి రోజే తాండూర్ లో తెలుగు పేపర్ లీకేజ్ కావడం, రెండవ రోజు వరంగల్లో హిందీ పేపర్ లీకేజ్ కావడం ఇది ప్రభుత్వ మరియు ఉద్యోగుల కనుసన్నాలలోనే జరుగుతున్న పనిగా ఉందన్నారు.

పాఠ్యపుస్తకాలలో మత గ్రంథాలు

కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్య విధానం తీసుకొచ్చి పుస్తకాలలో మత గ్రంధాల ను చేర్చి మతాన్ని పెంచి పోషించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కాబట్టి మనం జాతీయ విద్య విధానం ఉపసంహరించుకోవాలని ఉద్యమించాలని అశోక్ పిలుపునిచ్చారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్ షిప్స్ 4వేల కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని ఆయన అన్నారు.

లీకేజీలకు ప్రభుత్వానిదే బాధ్యత

ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనాలు సృష్టిస్తున్న ఈ లీకేజీలను ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని అశోక్ తెలియజేశారు. లీకేజీలపై హైకోర్టు సిట్టిoగ్ జడ్జితో పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐఫ్‌డీఎస్ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు పెద్దరాపు రమేష్, ఏఐఫ్‌డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, రాష్ట్ర‌ కోశాధికారి పోతుగంటి కాశీ, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, రాష్ట్ర‌ సహాయ కార్యదర్శి బండారి చిరంజీవి, ఏఐసీటీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నర్ర ప్రతాప్, రాష్ట్ర కమిటీ సభ్యులు జన్ను రమేష్, బోధ్ర బోయిన భాను, పిట్టల సాయి కుమార్, గడ్డం రాజు, ప్రణయ్, రామ్ మోహన్, బానేష్, వంశీ ప్రసాద్, మార్త నాగరాజు, సాయిరాం, సాయి కుమార్, వినోద్, వేణు సుజెoదర్, సందీప్, గీత, అమూల్య, ఐశ్వర్య, అంజలి, ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి సుంచూ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.