Pawan Kalyan | ఈసారి నన్ను ఎవరు ఆపుతారో చూస్తా.. తొలిరోజు వారాహి యాత్ర పూర్తి!
Pawan Kalyan అభిమాన గణం నడుమ పవన్ రోడ్ షో!! విధాత: మొదటిరోజు ఆంధ్ర లో పవన్ కళ్యాణ్ రోడ్ షో పూర్తి చేశారు. అశేష అభిమానులు.. కుర్రకారు.. యువత వెంటరాగా ఆయన అన్నవరంలో పూజలు అనంతరం కత్తిపూడి మీదుగా యాత్ర చేశారు. ఈ సందర్భంగా తనను ఈసారి ఎవరూ ఆపలేరని, అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతానని అన్నారు. గతంలో కుట్ర చేసి, కక్షగట్టి దొంగ ఓట్లు వేసి, అంటే జాబితాలో ఉన్న ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు […]

- అభిమాన గణం నడుమ పవన్ రోడ్ షో!!
విధాత: మొదటిరోజు ఆంధ్ర లో పవన్ కళ్యాణ్ రోడ్ షో పూర్తి చేశారు. అశేష అభిమానులు.. కుర్రకారు.. యువత వెంటరాగా ఆయన అన్నవరంలో పూజలు అనంతరం కత్తిపూడి మీదుగా యాత్ర చేశారు. ఈ సందర్భంగా తనను ఈసారి ఎవరూ ఆపలేరని, అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతానని అన్నారు. గతంలో కుట్ర చేసి, కక్షగట్టి దొంగ ఓట్లు వేసి, అంటే జాబితాలో ఉన్న ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు పొలయ్యేలా నకిలీ ఓట్లు వేసి తనను ఓడించారని ఆరోపించారు.
ఈసారి పవన్ తన బలాన్ని జగన్ కన్నా టిడిపికి ఎక్కువగా చూపాలని భావిస్తున్నట్లు ఉంది. వాస్తవానికి జగన్ ఏనాడూ పవన్ ను కనీసం పేరుపెట్టి కూడా ప్రస్తావించలేదు. ఎన్నడైనా పవన్ విషయం చెప్పాలి అనుకుంటే చంద్రబాబు దత్తపుత్రుడు అనడమే తప్ప ఏనాడూ పవన్ కళ్యాణ్ అని ఉచ్చరించలేదు.
ఇక పవన్ తన బలం.. కాపుల మద్దతు అంతా ఈస్ట్.. వెస్ట్ గోదారి జిల్లాల్లోనే ఉందని భావిస్తున్నారు.
Drone Visuals – కత్తిపూడి
వారాహి విజయ యాత్ర తొలి బహిరంగ సభ #VarahiVijayaYatra pic.twitter.com/lkV0ieycds
— JanaSena Party (@JanaSenaParty) June 14, 2023
ఈ నేపథ్యంలో ఆ జిల్లాలతో బాటు ఉత్తరాంధ్రలో కూడా గౌరవప్రదమైన సీట్లు కావాలని చంద్రబాబును కొరాలన్నది పవన్ అభిమానులు, నాయకుల డిమాండ్. అయితే చంద్రబాబు మాత్రం పాతిక ఇరవైకి మించి అసెంబ్లీ సీట్లు ఇచ్చేలా కనిపించడం లేదు.
ఇలాగైతే ఇక పవన్ కు రాజకీయాల్లో ఏమీ ప్రాధాన్యం ఉంటుంది..ఇచ్చే ఆ ఇరవై పాతిక సీట్లలో గెలిచేవి ఎన్ని… ఇలాగైతే పవన్ ను లెక్క చేసేది ఎవరు.. అందుకే ఈ రెండు జిల్లాలతో బాటు తనకు రాష్ట్రవ్యాప్తంగా బలం ఉందని చూపించి, బాబు దగ్గర నుంచి ఎక్కువ సీట్లు లాక్కోవాలని పవన్ ను ఆయన అభిమానులు.. కార్యకర్తలు సూచిస్తున్నారు.
ఇక గోదావరి జిల్లాల్లో జనసేన కు బలం పెరిగింది గ్రాఫ్ బాగా ఉంది అన్నది సర్వేలు కొన్ని బయట పెట్టాయి. పవన్ కి ఈ ప్రాంతము కీలకం అనేలా భావించాలి. ఇక్కడ టీడీపీ కూడ గట్టిగానే ఉంది. ఆ పార్టీకి గోదావరిలో పటిష్టమైన క్యాడర్ ఉంది.
ఇక అదే జిల్లాల్లో తాము సైతం బలపడి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం యాభై అయినా ఎమ్మెల్యే సీట్లు
తీసుకోకపోతే ఎలా ?? అందుకే బలం చూపాలి అనే భావనలో పవన్ ఉన్నారని అంటున్నారు.