యాత్రలకు లోకేశ్, పవన్ సిద్ధం! హైకోర్టు పైనే బరోసా?
విధాత: ఎన్నికల సీజన్ వచ్చేసింది.. అప్పుడే ఆయపార్టీలు ఆస్త్రశస్త్రాలు యుద్ధానికి సిద్ధం చేసుకుంటుండగా అధికార పార్టీ వైఎస్సార్సీపీ సైతం సర్వేలు.. పని తీరు ఇతరత్రా లెక్కల్లో బిజీగా వుంది.. అవసరం లేదన్న ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్లను పక్కన పెట్టేస్తూ లెక్కలు వేసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉండగా అటు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ.. జనసేనలు రోడ్డు షోలు.. పాదయాత్రలకు ప్లాన్ చేస్తున్నాయి. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన వారాహి […]

విధాత: ఎన్నికల సీజన్ వచ్చేసింది.. అప్పుడే ఆయపార్టీలు ఆస్త్రశస్త్రాలు యుద్ధానికి సిద్ధం చేసుకుంటుండగా అధికార పార్టీ వైఎస్సార్సీపీ సైతం సర్వేలు.. పని తీరు ఇతరత్రా లెక్కల్లో బిజీగా వుంది.. అవసరం లేదన్న ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్లను పక్కన పెట్టేస్తూ లెక్కలు వేసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు.
ఇదిలా ఉండగా అటు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ.. జనసేనలు రోడ్డు షోలు.. పాదయాత్రలకు ప్లాన్ చేస్తున్నాయి. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన వారాహి వాహనం రోడ్డు మీదకు రాబోతోంది. ఇక తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ యువగళం పేరిట ఈనెల 27 నుంచి కుప్పంతో ప్రారంభించనున్నారు.
400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్రకు ఇప్పటి దాకా జగన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా ఇవ్వకున్నా రాజ్యాంగాన్ని పట్టుకుని యాత్రకు బయల్దేరతామని తెలుగుదేశం నేతలు అంటున్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఏ రకమైన చర్యలకు దిగినా సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
మరో వైపు చూస్తే జీవో నంబర్ 1 అన్న దాని మీద ప్రస్తుతం హై కోర్టులో విచారణ సాగుతోంది. ఈ నెల 23 వరకూ మాత్రమే ఈ జీవోను హై కోర్టు సస్పెండ్ చేసింది. దాంతో హై కోర్టు ఏమి చెబుతుంది అన్నది చూడాలి. . హై కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే యాత్రలకు పచ్చ జెండా ఊపేసినట్లే. అలా కాకుండా జీవో మీద ఏమైనా సానుకూలంగా వ్యవహరిస్తే జీవో ప్రకారం రోడ్ల మీద సభలు కానీ రోడ్డు షోలు కానీ జరిపేందుకు వీలు ఉండదు.
దాంతో ఇపుడు ప్రభుత్వం కూడా హై కోర్టు వైపే చూస్తోంది. నిజానికి హై కోర్టు సస్పెన్షన్ లో పెట్టిన జీవో విషయంలో సుప్రీం కోర్టు దాకా ప్రభుత్వం వెళ్ళింది అంటేనే జీవో నంబర్ 1 మీద ఎంత పట్టుదలగా ఉందో అర్ధమవుతోంది. అయితే హై కోర్టుకే ఈ విషయం సుప్రీం కోర్టు వదిలేసినందు వల్ల అక్కడ తీర్పు కోసం వేచి ఉండక తప్పదు.
ఇక పవన్ కళ్యాణ్ వారాహి రథంతో రోడ్డు షోకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసిన ఈ ప్రత్యేక వాహనం ఏపీలో తిరగాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. అయితే దీనికి ఇంకా అనుమతి రాలేదు. ప్రతిపక్షాల సభలు..రోడ్డు షోలను జీవో-1తో అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తుండగా ఎలాగైనా తాము ప్రజల్లోకి వెళ్తామని ప్రతిపక్షాలు పట్టుదలతో ఉన్నాయి.