Kashmiri Girl’s Request to Modi | మోదీ జీ.. మాకొక మంచి స్కూలు కట్టించరా?

ప్రధానిని కోరిన కశ్మీరీ చిన్నారి దుస్తులు మురికి పట్టిపోతున్నాయి టాయ్‌లెట్‌కు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంది మీరు దేశం మాట వింటారుగా.. నా మాట కూడా ఆలకించండి.. పాడైపోయిన స్కూలుపై బాలిక వీడియో Kashmiri Girl's Request to Modi । ముద్దులొలికే మాటలతో ఓ బాలిక తమ స్కూలు దుస్థితిని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువచ్చింది. దుర్భరంగా ఉన్న తమ స్కూలును వీడియోలో చూపించింది. పగుళ్లు వచ్చి, మట్టి కొట్టుకు పోయిన అరుగులపై కూర్చుంటున్నామని తమ దుస్థితిని […]

Kashmiri Girl’s Request to Modi | మోదీ జీ.. మాకొక మంచి స్కూలు కట్టించరా?
  • ప్రధానిని కోరిన కశ్మీరీ చిన్నారి
  • దుస్తులు మురికి పట్టిపోతున్నాయి
  • టాయ్‌లెట్‌కు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంది
  • మీరు దేశం మాట వింటారుగా..
  • నా మాట కూడా ఆలకించండి..
  • పాడైపోయిన స్కూలుపై బాలిక వీడియో

Kashmiri Girl’s Request to Modi । ముద్దులొలికే మాటలతో ఓ బాలిక తమ స్కూలు దుస్థితిని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువచ్చింది. దుర్భరంగా ఉన్న తమ స్కూలును వీడియోలో చూపించింది. పగుళ్లు వచ్చి, మట్టి కొట్టుకు పోయిన అరుగులపై కూర్చుంటున్నామని తమ దుస్థితిని వివరించింది. ఆఖరుకు టాయ్‌లెట్‌కు వెళ్లేందుకు కూడా తగిన సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఫేస్‌బుక్‌లో ఈ వీడియో వైరల్‌ అవుతున్నది.

విధాత : దుమ్ముకొట్టుకుపోయిన పరిసరాలు, కూర్చునేందుకు కూడా వీలులేని అరుగులు.. భూత్‌ బంగ్లాను తలపిస్తున్న పాఠశాల భవనం! ఎవరికి చెబితే సమస్య పరిష్కారం అవుతుందో అర్థం కాలేదేమో.. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకే మొరపెట్టుకున్నది జమ్ముకశ్మీర్‌లోని కతువా జిల్లా లోహాయి మలార్‌ గ్రామానికి చెందిన చిన్నారి. ‘ప్లీజ్‌ మోదీ జీ.. ఏక్‌ అచ్చీ సీ స్కూల్‌ బన్వాదో నా’ అంటూ సీరత్‌ నాజ్‌ అనే చిన్నారి చేసిన విజ్ఞప్తి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మర్మిక్‌ న్యూస్‌ అనే ఫేస్‌ బుక్‌ పేజీలో షేర్‌ అయిన 5 నిమిషాల నిడివిగల ఈ వీడియోను 20 లక్షల మంది చూశారు.

మోదీ జీ.. ముఝే నా ఆప్‌ సే ఏక్‌ బాత్‌ కెహనీ హై

తనపేరు సీరత్‌ నాజ్‌ అనీ.. తాను ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నానని తెలిపిన చిన్నారి.. ‘మోదీ జీ.. ముఝే నా ఆప్‌ సే ఏక్‌ బాత్‌ కెహనీ హై’ (మోదీజీ మీకు ఒక మాట చెప్పాలని ఉన్నది’ అంటూ వీడియోను ప్రారంభించింది. స్కూలు ప్రాంగణం మొత్తం కలియదిరుగుతూ అక్కడి దయనీయ పరిస్థితిని చూపించింది.

‘అది మా ప్రిన్సిపల్‌ రూమ్‌. పక్కనే ఉన్నది స్టాఫ్‌రూమ్‌.. ఇక్కడ అరుగు చూడండి.. ఎంత మురికి పట్టి ఉన్నదో. మమ్మల్ని ఇక్కడే కూర్చోపెడతారు’ అని తెలిపింది. రండి.. మీకు మా భారీ స్కూలు బిల్డింగ్‌ చూపిస్తాను.. అంటూ తమ స్కూలును వర్చువల్‌ టూర్‌ తరహాలో చూపింది. ఆమె అలా కెమెరా తిప్పే సరికి.. అక్కడ ఇంకా సగం కట్టి వదిలేసినట్టున్న భవనం కనిపిస్తుంది.

  1. 10000000_722721029638624_8181172207636161739_n (1)


‘చూడండి.. ఈ బిల్డింగ్‌ ఐదేళ్ల నుంచి ఎంత అపరిశుభ్రంగా ఉన్నదో.. రండి.. మీకు బిల్డింగ్‌ లోపలి నుంచి చూపిస్తాను’ అంటూ పిల్లలు కూర్చొనే చోటు చూపించింది. అక్కడ అంతా దుమ్ము పేరుకుపోయి ఉన్నది. మళ్లీ కెమెరాను తనవైపు తిప్పుకొని, ‘మాకు ఒక మంచి స్కూలు కట్టించరూ.. మేం ఇదే నేలపై కూర్చుంటాం. దానితో మా యూనిఫారాలు మురికి అయిపోతున్నాయి. దుస్తులు పాడు చేసుకుని ఇంటికి వస్తున్నారంటూ మా అమ్మలు తిడుతున్నారు.

మాకు కూర్చొనటానికి బెంచీలు కూడా లేవు’ అని నాజ్‌ తెలిపింది. ఆ తర్వాత మెట్ల మీద నుంచి కారిడార్‌లోకి వెళితే.. అక్కడ కూడా అంతా దుమ్ము కొట్టి ఉంటుంది. దానిని చూపించిన తర్వాత.. ‘ప్లీజ్‌ మోదీజీ.. మే ఆప్‌ సే రిక్వెస్ట్‌ కర్తీ హూ కీ అచ్చా సా బనా దే ఏ స్కూల్. మేరీ భీ బాత్‌ సున్‌ లో ప్లీజ్’ అని విజ్ఞప్తి చేసింది.

దయనీయంగా టాయ్‌లెట్‌

అక్కడి నుంచి మెట్లు దిగి.. కాంపౌండ్‌ బయటకు వస్తూ అక్కడ ఉన్న పరిస్థితిని చూపిస్తుంది. అక్కడ టాయ్‌లెట్‌ను చూపిస్తుంది. ‘చూడండి.. టాయ్‌లెట్‌ ఎంత మురికిగా ఉన్నదో. తలుపు విరిగిపోయింది కూడా’ అని వివరిస్తూ.. తాము వెళ్లే కాల్వను చూపిస్తుంది. చివరిగా.. ‘మోదీజీ.. మీరు మొత్తం దేశం చెప్పేది వింటారు. నా మాట కూడా వినండి.

మాకొక మంచి స్కూలు కట్టించండి. ఆ స్కూలు ఎలా ఉండాలంటే.. మేం కింద కూర్చొనకూడదు. అప్పడు మా అమ్మ కూడా నా యూనిఫాం మురికి అయిపోయిందని తిట్టదు. అప్పడు అందరం బాగా చదువుకుంటాం. ప్లీజ్‌ మాకు ఒక మంచి స్కూలు కట్టించి ఇవ్వండి’ అంటూ ముగించింది.