తెలంగాణలో దోపిడీ చాలలేదని చెప్పి ఢిల్లీ దాకా వచ్చే లిక్కర్ స్కాం చేశారు

శక్తిని నాశనం చేస్తానని.. శక్తికి వ్యతిరేకంగా పోరాడుతామని ఇండియా కూటమి నేత రాహుల్ గాంధీ చెప్పారని, తాను రాహూల్ సవాల్ స్వీకరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

తెలంగాణలో దోపిడీ చాలలేదని చెప్పి ఢిల్లీ దాకా వచ్చే లిక్కర్ స్కాం చేశారు
  • తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్న బిఆర్ఎస్, కాంగ్రెస్
  • జగిత్యాల సభలో ప్రధాని మోడీ


విధాత:  పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు వికసిత భారత్, వికసిత తెలంగాణ కోసం బిజెపిని గెలిపించాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పని అయిపోతుందని వ్యాఖ్యానించారు. జగిత్యాల బీజేపీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. దేశంలో జరిగే స్కామ్ లన్నిటికీ కుటుంబ పార్టీలే కారణమన్నారు. తెలంగాణలో బిజెపికి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే నాకు అంత శక్తి వస్తుంది అన్నారు. నాకు అధికారం కాపాడుకోవడం కన్నా ప్రజల శ్రేయస్సుకోసం నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యం అన్నారు.


తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను లూటీ చేశారనీ, తెలంగాణలోదోపిడీ చాలలేదని చెప్పి ఢిల్లీ దాకా వచ్చే లిక్కర్ స్కాం చేశారని విమర్శించారు. దేశంలో కుటుంబ పార్టీలన్నీ దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. టుజీ స్పేక్టమ్ స్కాం డిఎంకె.. బోఫోర్స్ స్కాం.. నేషనల్ హెరాల్డ్ స్కామ్ కాంగ్రెస్ పెద్దల కుటుంబం చేసినవేనని చెప్పారు. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో స్కాములు కుటుంబ పార్టీల నిర్వాకమేనన్నారు.


అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అదే పని చేస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ అవినీతి ఫైల్స్ ను కాంగ్రెస్ పాలకులు పక్కన పెట్టారని మోడీ విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టులో దోపిడీకి పాల్పడిన బిఆర్ఎస్ తెలంగాణను ఏటీఎం గా వాడుకుందని ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణను ఏటీఎం గా మార్చుకుందని మోడీ ఆరోపించారు.


తెలంగాణ నుంచి దోచుకున్న సొమ్మును కాంగ్రెస్ పెద్దలకు అందిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ అవినీతిపై కేంద్రం విచారణ చేపడితే మోడీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. అవినీతి దోపిడీలో కాంగ్రెస్ బిఆర్ఎస్ లు పరస్పరం సహకరించుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బిజెపి క్రమంగా బలపడుతుందన్నారు. మే 11న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారన్నారు .


తమ పాలనలో 25 కోట్ల మంది దేశ ప్రజలను పేదరికం నుంచి బయట పడేశామని, నాలుగు కోట్ల మందికి పీఎం ఆవాస్ ద్వారా ఇండ్లు నిర్మించామని, 50 కోట్ల మందిని బ్యాంకింగ్ రగానికి అనుసంధానం చేశామనీ, భారత్ ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా వేయికోట్ల రుణాలు అందించామన్నరు. తెలంగాణ లో 12 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చామని, 30 లక్షల మంది రైతులకు కిసాన్ సామ్మాన్ అందించామని చెప్పారు. తెలంగాణలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామన్నారు. లోక్‌స‌భ ఎన్నికలు కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం రావడానికి జరుగుతున్న ఎన్నికలుగా తెలంగాణ ప్రజలు గుర్తించి బిజెపి ఎంపీలను గెలిపించాలని కోరారు.


ప్రపంచంలో భారత్ ను 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు . రైతులకు మద్దతుగా యూరియా పంపిణీ మెరుగుపరిచామమని, ఫసల్ బీమా ద్వారా పంటల బీమా అమలు చేస్తున్నామన్నారు . మద్దతు ధర అందిస్తున్నామని తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తామని చెప్పి నెరవేర్చామన్నారు.


నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి టిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా చేయలేదను, మేము రామగుండం ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి చేశామన్నరు. 2500 కిలోమీటర్లు తెలంగాణలో జాతీయ రహదారులు నిర్మించాం మోడీ చెప్పారు. తెలంగాణకు కేంద్రం వేలకోట్ల అభివృద్ధి పనులు చేసిందను, వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం మరింత పెంచుతామన్నరు.


ట్విట్టర్ ఎక్స్ లో నమో ఇన్ తెలుగులో నాతో మాట్లాడడం ద్వారా నాకు మద్దతు ఇవ్వడం ద్వారా మోడీ మీ జేబులో ఉన్నట్లుగా భావించండని చెప్పారు. నేను మీకు వికసిత్ తెలంగాణ గ్యారెంటీ ఇస్తున్నానని, మీరు నాకు పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించే గ్యారెంటీ ఇవ్వాలని కోరారు.


శక్తిని నాశనం చేస్తానని.. శక్తికి వ్యతిరేకంగా పోరాడుతామని ఇండియా కూటమి నేత రాహుల్ గాంధీ చెప్పారని, తాను రాహూల్ సవాల్ స్వీకరిస్తున్నానని.. నేను భారత మాత పూజారినని దేశంలో ప్రతి మహిళ ను శక్తి స్వరూపిణిగా పూజిస్తారని.. శక్తిని నాశనం చేస్తారని ఎవరైనా అంటారా అని శక్తిని నాశనం చేసే వాళ్లకు శక్తిని పూజించే వాళ్లకు మధ్య జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతాన్ని కూడా శివశక్తి అని పేరు పెట్టుకున్నామనీ గుర్తు చేశారు.