Vande Bharat | ఈ నెల 24 నుంచి కూతపెట్టనున్న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్..! విజయవాడ – చెన్నైలో రూట్‌లో కూడా..!
Vande Bharat | ఈ నెల 24న పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు ప్రారంభంకానున్నాయి. కాచిగూడ-యశ్వంత్‌పూర్ మార్గంలో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. దాంతో పాటు కొత్తగా విజయవాడ - చెన్నై రూట్‌లోనూ రైలు పట్టాలెక్కనున్నది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ-చెన్నై మధ్య నడిపేందుకు రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ రైలును సైతం ఈ నెల 24న ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట […]

Vande Bharat |
ఈ నెల 24న పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు ప్రారంభంకానున్నాయి. కాచిగూడ-యశ్వంత్‌పూర్ మార్గంలో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. దాంతో పాటు కొత్తగా విజయవాడ – చెన్నై రూట్‌లోనూ రైలు పట్టాలెక్కనున్నది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ-చెన్నై మధ్య నడిపేందుకు రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ రైలును సైతం ఈ నెల 24న ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు చేరుతుంది.
విజయవాడ – చెన్నై వందేభారత్ ఇలా..
గురువారం మినహా వారంలో మిగతా అన్ని రోజుల్లో రైలు పరుగులు తీస్తుంది. ఉదయం విజయవాడలో 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటల వరకు చెన్నైకి చేరుతుంది. తిరిగి అక్కడి నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుంది. ప్రస్తుతం విజయవాడ – చెన్నై మధ్య ఇంటర్ సిటీ పినాకిని ఎక్స్‌ప్రెస్ నడుస్తున్నది.
ఈ రైలు ప్రయాణానికి దాదాపు ఏడు గంటల సమయం పడుతున్నది. ఈ రైలు ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నది. వందే భారత్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం మరింత తగ్గనున్నది. మరో వైపు చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన తొలి కాషాయ రంగు వందే భారత్ రైలును కేరళకు కేటాయిం చారు. కాసర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వయా అలెప్పి మార్గంలో రైలును పట్టాలెక్కించేందుకు రైల్వేబోర్డు చర్యలు చేపడుతున్నది.
ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
ఈ నెల 24న ప్రధాని మోదీ ఒకేసారి తొమ్మిది వందేభారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగనున్నాయి. ఇందులో కాచిగూడ-యశ్వంత్‌పూర్, విజయవాడ-చెన్నై రైళ్లు సైతం ఉన్నాయి. ఆయా రైళ్లను ఆదివారం ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు.
కాచిగూడ రైల్వేస్టేషన్ వేదికగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.30కు బయలుదేరి.. మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరిగి 2.45కు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి, రాత్రి 11.15కు కాచిగూడ చేరుతుంది.