రుణాలపై వడ్డీరేట్ల పెంపు షురూ
-25 బేసిస్ పాయింట్లదాకా పెంచిన పీఎన్‌బీ, బీవోబీ విధాత: బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను పెంచడం మొదలుపెట్టాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకులూ ఆ మేరకు పెంచేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) 25 బేసిస్ పాయింట్ల వరకు తమ రెపో ఆధారిత రుణ […]

-25 బేసిస్ పాయింట్లదాకా పెంచిన పీఎన్‌బీ, బీవోబీ
విధాత: బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను పెంచడం మొదలుపెట్టాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకులూ ఆ మేరకు పెంచేస్తున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) 25 బేసిస్ పాయింట్ల వరకు తమ రెపో ఆధారిత రుణ రేట్ల (ఆర్ఎల్ఎల్ఆర్)ను పెంచాయి. ఈ నిర్ణయంతో ఆయా రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి.
ఇప్పటికే రుణాలు తీసుకున్నవారి ఈఎంఐల్లో, టెన్యూర్లలోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. మరికొన్ని బ్యాంకులు కూడా వడ్డీరేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తుండగా, ఇదే జరిగితే గృహ, ఆటో, వ్యక్తిగత, విద్యా రుణాలు ప్రియం కానున్నాయి.
ఇక తాజా నిర్ణయంతో పీఎన్‌బీ ఆర్ఎల్ఎల్ఆర్ 8.75 శాతం నుంచి 9 శాతానికి చేరింది. బీవోబీ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ ఫండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) అన్ని టెన్యూర్లపై 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఓవర్‌నైట్ టెన్యూర్ పై 7.9 శాతానికి, నెలకు 8.2 శాతానికి, మూడు నెలలకు 8.3 శాతానికి, ఏడాదికి 8.55 శాతానికి ఎంసీఎల్ఆర్‌లు చేరాయి.