వరంగల్: దళితుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

మంచుప్పుల దళితుల ఆవేదన ఏడాదిగా పోరాటం చేస్తున్నా ప‌ట్టించుకోని వైనం సమస్య పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామ‌ని హెచ్చ‌రిక‌ విధాత, వరంగల్: మంచుప్పల గ్రామ దళితలు తమ భూమిని కాపాడుకునే పోరాటంలో భాగంగా మంగళవారం చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయమే దేవరుప్పుల, పాలకుర్తి పోలీసులు మంచుప్పుల గ్రామంలో మోహరించి పాదయాత్రకు సిద్ధమవుతున్న దళితులను అడ్డుకున్నారు. ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో మంచిప్పుల దళిత భూ పోరాట కమిటీ చేపట్టిన పాదయాత్ర భగ్నమయింది. ఏడాదిగా […]

వరంగల్: దళితుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
  • మంచుప్పుల దళితుల ఆవేదన
  • ఏడాదిగా పోరాటం చేస్తున్నా ప‌ట్టించుకోని వైనం
  • సమస్య పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామ‌ని హెచ్చ‌రిక‌

విధాత, వరంగల్: మంచుప్పల గ్రామ దళితలు తమ భూమిని కాపాడుకునే పోరాటంలో భాగంగా మంగళవారం చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయమే దేవరుప్పుల, పాలకుర్తి పోలీసులు మంచుప్పుల గ్రామంలో మోహరించి పాదయాత్రకు సిద్ధమవుతున్న దళితులను అడ్డుకున్నారు. ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో మంచిప్పుల దళిత భూ పోరాట కమిటీ చేపట్టిన పాదయాత్ర భగ్నమయింది.

ఏడాదిగా భూపోరాటం

దళితులు తమ భూమి రక్షణ కోసం ఏడాదికాలంగా అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని మంచుప్పులలో ఈ కబ్జా భాగోతం జరిగింది. కబ్జా నుంచి తమ భూమిని రక్షించాలంటూ దళిత భూపోరాట కమిటీ నేతృత్వంలో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.

స్పందించ‌ని ప్ర‌జాప్ర‌తినిధులు

దళితులు ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ అధికార ప్రజాప్రతినిధుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళన తీవ్రతరం చేసేందుకు సిద్ధమయ్యారు. ఏడాది కాలంగా చేపట్టిన నిరసనకు కొనసాగింపుగా మంచిప్పుల గ్రామం నుంచి పాలకుర్తి వరకు మంగళవారం పాదయాత్ర చేపట్టేందుకు దళితుల భూ పోరాట కమిటీ కార్యాచరణకు సిద్ధమైనందున పోలీసులు అప్రమత్తమయ్యారు. మంచుప్పులలో మోహరించిన పోలీసులు మహిళలు వృద్ధులు అనే తేడా లేకుండా వారిని పాదయాత్ర చేయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దళితులు పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది.

భూసమస్య పరిష్క‌రించే వరకు ఆందోళన: కాకర్ల రమేష్

కబ్జా నుండి తమ భూమిని విడిపించుకొని తమకు చెందే వరకు ఆందోళన కొనసాగిస్తామని దళిత భూ పోరాట కమిటీ అధ్యక్షుడు కాకర్ల రమేష్ తెలిపారు. ఏడాదికాలంగా దళితులమంతా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నాం. సమస్య పరిష్కారం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.