HYDలో ఉగ్రవాదుల కుట్ర భగ్నం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ బందోబస్తు
విధాత: హైదరాబాద్‌లో ఉగ్ర కుట్రను సిట్ పోలీసులు భగ్నం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలపై దాడులతో పాటు పేలుళ్లకు జాహిద్ కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద సంస్థల కోసం జాహిద్ ఆరుగురు యువకులను రిక్రూట్ చేసినట్లు వెల్లడించారు. నగరంలో జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, దసరా ఉత్సవాలు జరిగే ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేయాలని జాహెద్ అండ్ టీం ప్లాన్ చేసిందని పోలీసులు చెప్పారు. జాహిద్‌ను హైదరాబాద్ పోలీసులు […]

విధాత: హైదరాబాద్‌లో ఉగ్ర కుట్రను సిట్ పోలీసులు భగ్నం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలపై దాడులతో పాటు పేలుళ్లకు జాహిద్ కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద సంస్థల కోసం జాహిద్ ఆరుగురు యువకులను రిక్రూట్ చేసినట్లు వెల్లడించారు.
నగరంలో జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, దసరా ఉత్సవాలు జరిగే ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేయాలని జాహెద్ అండ్ టీం ప్లాన్ చేసిందని పోలీసులు చెప్పారు. జాహిద్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో మక్కా మసీదు పేలుళ్ల కేసులో జాహిద్‌ను పోలీసులు ప్రశ్నించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
నిఘా వర్గాల హెచ్చరికలతో భారీ బందోబస్తు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దసరా పండుగ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పెద్ద సంఖ్యలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలు బందోబస్తులో ఉన్నాయి. రైల్వే స్టేషన్‌లో గేట్ నెంబర్ 3 నుంచి మాత్రమే ప్రయాణికుల ఎంట్రీ బోర్డు పెట్టారు. గేట్ నెంబర్ 4 వద్ద నో ఎంట్రీ బోర్డు ఏర్పాటు చేశారు. గేట్ నెంబర్ 5ను పూర్తిగా మూసి వేశారు.