‘రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ చిరంజీవి ట్వీట్.. గాడ్‌ఫాదర్ హీట్‌కేనా?
విదాత: నేను రాజకీయానికి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ మంగళవారం చిరంజీవి ట్వీట్ చేసిన ఆడియో వైరల్‌గా మారింది. ఇది మరో 15 రోజుల్లో విడుదల కానున్న చిరంజీవి సినిమా గాడ్‌ఫాదర్ ప్రమోషన్ కోసమా? లేక చిరంజీవి తిరిగి రాజకీయాల్లో అడుగు పెట్టే ఉద్దేశంతో చేసిన ట్వీటా అన్న చర్చ జరుగుతోంది. ఎక్కువ శాతం ఇది గాడ్‌ఫాదర్ సినిమా ప్రమోషన్ హీటప్ చేసేందుకే అంటున్నారు. ట్వీట్ చేసిన ఆడియోకు యాడ్ […]

విదాత: నేను రాజకీయానికి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ మంగళవారం చిరంజీవి ట్వీట్ చేసిన ఆడియో వైరల్‌గా మారింది. ఇది మరో 15 రోజుల్లో విడుదల కానున్న చిరంజీవి సినిమా గాడ్‌ఫాదర్ ప్రమోషన్ కోసమా? లేక చిరంజీవి తిరిగి రాజకీయాల్లో అడుగు పెట్టే ఉద్దేశంతో చేసిన ట్వీటా అన్న చర్చ జరుగుతోంది.
ఎక్కువ శాతం ఇది గాడ్‌ఫాదర్ సినిమా ప్రమోషన్ హీటప్ చేసేందుకే అంటున్నారు. ట్వీట్ చేసిన ఆడియోకు యాడ్ చేసిన చిరంజీవి ఫొటో కూడా గాడ్‌ఫాదర్ సినిమా స్టిల్‌నే పోలి ఉండటంతో ఈ అవగాహనకు వస్తున్నారు.
మోహన్‌లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించిన మళయాళ సూపర్‌హిట్ సినిమా లూసీఫర్ రీమేక్‌గా గాడ్‌ఫాదర్ సినిమా వస్తోంది. చిరంజీవి స్టార్ డమ్‌ను పెంచే విధంగా దర్శకుడు మోహన్‌రాజా కథలో కొన్ని మార్పులు చేశారు. మళయాళంలో పృథ్విరాజ్ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్‌ఖాన్‌తో చేయిస్తున్నారు.
చిరంజీవి సోదరి పాత్రలో నయనతార, విలన్‌గా సత్యదేవ్ నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిరు పొలిటికల్ డైలాగ్ ట్వీట్‌తో మొత్తంగా సోషల్ మీడియాలో గాడ్‌ఫాదర్ హాట్ టాపిక్‌గా మారింది.