కాంగ్రెస్‌లోకి పొంగులేటి.. సికింద్రాబాద్‌కు షర్మిల?
విధాత: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు పాలేరు నుంచి పోటీ చేస్తానని తనను ఆశ్వీర్వదించాలని కోరారు. అక్కడ ఇళ్లు కూడా కట్టుకుంటానని చెప్పారు. ఆ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఖమ్మం బీఆర్‌ఎస్‌లో జరిగిన రాజకీయ పరిణామాలతో పాలేరు నియోజకవర్గంలో పోటీ చేసే పేర్లలో కొత్త కొత్తవి వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రస్తుత ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి, షర్మిల, తాజాగా అక్కడ అధికారపార్టీ అసమ్మతి నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు […]

విధాత: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు పాలేరు నుంచి పోటీ చేస్తానని తనను ఆశ్వీర్వదించాలని కోరారు. అక్కడ ఇళ్లు కూడా కట్టుకుంటానని చెప్పారు. ఆ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఖమ్మం బీఆర్‌ఎస్‌లో జరిగిన రాజకీయ పరిణామాలతో పాలేరు నియోజకవర్గంలో పోటీ చేసే పేర్లలో కొత్త కొత్తవి వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రస్తుత ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి, షర్మిల, తాజాగా అక్కడ అధికారపార్టీ అసమ్మతి నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు కూడా చక్కర్లు కొడుతున్నది. ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
బీజేపీలోకి వెళ్తారా? లేక కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్ సభపై స్పందిస్తూ.. దేశ రాజకీయాలకు దశదిశ ఇస్తామని కేసీఆర్ చెప్పినా అది ఎక్కడా కనిపించలేదన్నారు.
ఆయనది ప్రచార ఆర్భాటమే గాని ఎలాంటి అజెండా ప్రకటించలేదని ధ్వజమెత్తారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఎక్కువ మందిని ఆహ్వానిస్తున్నామని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికకు తాను అడ్డుకాదని.. ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు
పాలేరు ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచే గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి గెలుపొంది తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన 12 మందిలో ఆయన ఒకరు. దీంతో ఆ స్థానంలో బీఆర్‌ఎస్ నుంచి పోటీ ఎక్కువగా ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులు కూడా పెద్దగా డిమాండ్ చేయడం లేదు.
దీంతో పొంగులేటిని పార్టీలోకి తీసుకొస్తే.. ఖమ్మం పార్లమెంటు స్థానంతో పాటు మెజారిటీ అసెంబ్లీ సీట్లు సాధించవచ్చు అని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు యత్నిస్తున్నాయి. కానీ ఆయన ఇప్పటికీ ఏ పార్టీలో చేరేది తేల్చలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో భట్టి కామెంట్లు పొంగులేటికి కాంగ్రెస్‌లోకి లైన్ క్లియర్ అయ్యిందా? అనేది చర్చనీయాంశమైంది.
అయితే ఆయన బీజేపీలోకి వెళ్తారు అనే ప్రచారం జరుగుతున్నా.. అక్కడ కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వామపక్ష భావజాలం బలంగా ఉన్న ఆ జిల్లాలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేదు. పొంగులేటి వ్యక్తిగత ప్రతిష్ట మీద గెలువాల్సిందే తప్పా ఆయనకు కాషాయ పార్టీతో పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఆయన వ్యక్తిగత ఇమేజ్‌తో ఈజీగా నెగ్గుతారు అని చర్చించుకుంటున్నారు.
ఒకవేళ పరిస్థితులు మారి పొంగులేటి కాంగ్రెస్‌లోకి వెళ్తే.. పాలేరులో బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డిలలో ఎవరో ఒకరు నిలబడుతారు. అలాగే ఈ నియోజకవర్గంలో పొంగులేటికి, తుమ్మలకు, మంత్రి పువ్వాడకు కూడా గట్టి పట్టున్నది.
ఈ పరిణామాలన్నీ తనకు ప్రతికూలంగా మారవచ్చు అని షర్మిల భావిస్తున్నారా? అంటే అవుననే వాదనలు ఉన్నాయి. పాలేరు నుంచి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాలనే తన ఆలోచనలకు ఆదిలోనే బ్రేకులు పడ్డాయట. వీళ్లందరిని తట్టుకుని నిలబడటం కంటే సికింద్రాబాద్ అయితే తనకు సేఫ్ అని ఆమె అనుకుంటున్నారట.
తన భర్త అనిల్ కూడా ఆమెను సికింద్రాబాద్ అసెంబ్లీకి పోటీ చేయాలని కోరుకుంటున్నారట. ఎందుకంటే అక్కడ క్రిస్టియన్ సామాజిక ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అక్కడ అయితే అనిల్‌పై ఉన్న అభిమానంతో వాళ్లంతా తనకు ఓట్లు వేస్తారనే లెక్కల్లో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు ఉన్నారట. ఎన్నికలు దగ్గర పడితే గాని వీటిపై స్పష్టత వస్తుంది. ముందుగా పొంగులేటి ఏ పార్టీలో చేరుతారు అన్న అంశం తేలితే తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది అంటున్నారు.