Ponguleti | పొంగులేటితో.. పిడమర్తి రవి భేటీ
Ponguleti సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్న రవి సండ్రను కాదని BRS అధిష్ఠానం టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు పార్టీలోనూ తగిన ప్రాధాన్యం లేదు.. కొంతకాలంగా మౌనంగా ఉంటున్న పిడమర్తి పొంగులేటి బాటలోనే కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం విధాత: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) వచ్చే నెల 5వ తేదీన కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ […]

Ponguleti
- సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్న రవి
- సండ్రను కాదని BRS అధిష్ఠానం టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు
- పార్టీలోనూ తగిన ప్రాధాన్యం లేదు.. కొంతకాలంగా మౌనంగా ఉంటున్న పిడమర్తి
- పొంగులేటి బాటలోనే కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం
విధాత: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) వచ్చే నెల 5వ తేదీన కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఒక్కరిని కూడా అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని సీఎం కేసీఆర్‌కు ఆయన సవాల్ చేశారు.
దానికి అనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే నాటికి ఖమ్మం జిల్లాలోని బీఆర్‌ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలంతా మెల్లమెల్లగా పొంగులేటి గ్రూప్‌లోకి చేరిపోతున్నారు.
తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన తెలంగాణ విద్యార్థి ఉద్యమనాయకుడు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి(Ponguleti)తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం సండ్ర బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీలో పిడమర్తికి ప్రాధాన్యం తగ్గిపోయింది. ఆయన పార్టీ అధిష్ఠానంపై నేరుగా విమర్శలు చేయకున్నా.. కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. మీడియాకు కూడా దూరంగా ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆయన మళ్లీ తెర మీదికి వచ్చారు. సత్తుపల్లిలో సండ్రను కాదని పిడమర్తికి టికెట్ దక్కే అవకాశం లేదు. అందుకే ఆయన కూడా పొంగులేటి(Ponguleti)తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న సమాచారం.