Ponguleti Srinivas Reddy | సీఎం జగన్‌తో.. పొంగులేటి భేటీ
Ponguleti Srinivas Reddy విధాత: ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్‌రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలువడం రాజకీయంగా ఆసక్తి రేపింది. వారిద్ధరు తమ భేటీలో ఏయే అంశాలపై చర్చించారన్న దానిపై వివరాలు వెల్లడికాలేదు. అయితే వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే విషయమై వారిద్ధరు మధ్య చర్చకు వచ్చివుంటుందని తెలుస్తుంది. 2014ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటికి, వైఎస్ జగన్‌కు మధ్య మొదటి నుండి […]

Ponguleti Srinivas Reddy
విధాత: ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్‌రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలువడం రాజకీయంగా ఆసక్తి రేపింది. వారిద్ధరు తమ భేటీలో ఏయే అంశాలపై చర్చించారన్న దానిపై వివరాలు వెల్లడికాలేదు. అయితే వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే విషయమై వారిద్ధరు మధ్య చర్చకు వచ్చివుంటుందని తెలుస్తుంది.
2014ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటికి, వైఎస్ జగన్‌కు మధ్య మొదటి నుండి కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. పొంగులేటి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం, ఆ పార్టీ నాయకత్వంతో విబేధాల నేపధ్యంలో బీఆర్‌ఎస్‌ను వీడి రాహుల్‌గాంధీ సమక్షంలో ఖమ్మం కాంగ్రెస్ సభలో ఆ పార్టీలో చేరడం జరిగింది.
ఈ పరిణామాలపై వారి మధ్య చర్చకు జరిగి ఉండవచ్చని, అంతేగాకుండా పొంగులేటికి చెందిన రాఘవ కనస్రక్ట్చన్ ఏపీలో చేస్తున్న పలు కాంట్రాక్టు పనుల పురోగతి పైన కూడా వారి మధ్య చర్చలు జరిగాయని సమాచారం