జోడో యాత్రను వాయిదా వేయండి.. రాహుల్‌ గాంధీకి కేంద్రం లేఖ

లేదంటే కరోనా నిబంధనలు పాటించండి విధాత: కరోనా విజృంభించే అవకాశాలున్న నేపథ్యంలో జోడో యాత్రను వాయిదా వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి తెలిపింది. ఈమేరకు యాత్రలో ఉన్న రాహుల్‌ గాంధీతో పాటు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ లేఖ రాశారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న పరిస్థితుల్లో జోడో యాత్రను వాయిదా వేసుకోవాలన్నారు. యాత్రను వాయిదా వేసుకోలేని పక్షంలో కరోనా వ్యాప్తి […]

జోడో యాత్రను వాయిదా వేయండి.. రాహుల్‌ గాంధీకి కేంద్రం లేఖ
  • లేదంటే కరోనా నిబంధనలు పాటించండి

విధాత: కరోనా విజృంభించే అవకాశాలున్న నేపథ్యంలో జోడో యాత్రను వాయిదా వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి తెలిపింది. ఈమేరకు యాత్రలో ఉన్న రాహుల్‌ గాంధీతో పాటు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ లేఖ రాశారు.

కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న పరిస్థితుల్లో జోడో యాత్రను వాయిదా వేసుకోవాలన్నారు. యాత్రను వాయిదా వేసుకోలేని పక్షంలో కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను పాటించాలన్నారు. ఈ మేరకు వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు మాత్రమే యాత్రలో ఉండాలని నిబంధనలు విధించారు.

అలాగే ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలని, నిర్ణీత దూరం పాటించాలని తెలిపారు. ఇది సాధ్యం కాని నేపథ్యంలో జోడో యాత్రను వాయిదా వేసుకోవాలన్నారు. ప్రస్తుతం రాహుల్‌ జోడో యాత్ర రాజస్థాన్‌లో కొనసాగుతున్నందున ఆ రాష్ట్ర సీఎంకు కూడ కేంద్రం లేఖ పంపింది.

రాహుల్‌ జోడో యాత్రను వాయిదా వేసుకోవాలని కేంద్ర మంత్రి ఇచ్చిన లేఖపై కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి స్పందిస్తూ రాహుల్‌ పాదయాత్ర చేయడం కేంద్ర మంత్రి మాండవీయకు నచ్చడం లేదని వ్యాఖ్యానించారు.