లోకేశ్ పాదయాత్ర వాయిదా.. రంగంలోకి బ్రాహ్మణి

విధాత : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు పరిణమాల నేపధ్యంలో ఈ నెల 9వ తేదీన రాజోలుల ఆగిపోయిన పాదయాత్రను నేడు శుక్రవారం పునఃప్రారంభించాలని లోకేశ్ నిర్ణయించారు.
అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 3వ తేదీన సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందునా ఢిల్లీ న్యాయవాదులతో లోకేశ్ చర్చించాల్సివుంది. అదిగాక ఈ కేసులో తమ వాదనలు వినాలని ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయపరంగా మరింత పోరాటం అనివార్యంకానుంది.
ఈ నేపధ్యంలో యువగళం పాదయాత్ర వాయిదా వేసుకోవాలని పార్టీ యాక్షన్ కమిటీ లోకేశ్‌కు సూచించింది. దీంతో ఆయన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. మరోవైపు ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతు ఏపీ హైకోర్టులో లోకేశ్ పిటిషన్ వేశారు.
మరోవైపు యువగళం పాదయాత్రకు ముందు లేక పాదయాత్రలో లోకేశ్‌ను సీఎం జగన్ ప్రభుత్వం అరెస్టు చేసిన పక్షంలో ఆయన స్థానంలో పాదయాత్రను కొనసాగించేందుకు టీడీపీ నాయకత్వం ఇప్పటికే నారా బ్రాహ్మణిని సిద్ధం చేస్తున్నట్లుగా పార్టీ వర్గాల చర్చించుకుంటున్నాయి.
చంద్రబాబు, లోకేశ్‌ల అరెస్టు పరిణామాలను భువనేశ్వరీ, బ్రాహ్మణిల ద్వారా ప్రజాక్షేత్రంలో ఎండగట్టి జగన్ ప్రభుత్వం సాగిస్తున్నకక్షసాధింపు, అక్రమ అరెస్టుల రాజకీయాలను తిప్పికొట్టాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది.