సాగర్‌లో టార్గెట్‌ను మించి విద్యుత్ ఉత్పత్తి.. 2265 మిలియన్ యూనిట్లు దాటిన జెన్కో
విధాత: నాగార్జునసాగర్‌లోని తెలంగాణ రాష్ట్ర జెన్కో పరిధిలోని జల విద్యుత్ కేంద్రాలలో తెలంగాణ రాష్ట్రం టార్గెట్‌ను మించి విద్యుత్ ఉత్పత్తి చేసిందని జెన్కో సీఈ మంగేశ్ కుమార్ తెలిపారు. 2020 -23 ఆర్థిక సంవత్సరానికి గాను నాగార్జునసాగర్‌లోని తెలంగాణ పరిధిలో జల విద్యుత్ కేంద్రాలలో ప్రధాన జల విద్యుత్ కేంద్రo, ఎడమ కాలువపై ఉన్న జల విద్యుత్ కేంద్రంలో మార్చి 2023 నాటికి 1500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టాల్సి ఉండగా గత సంవత్సరం అక్టోబర్ […]

విధాత: నాగార్జునసాగర్‌లోని తెలంగాణ రాష్ట్ర జెన్కో పరిధిలోని జల విద్యుత్ కేంద్రాలలో తెలంగాణ రాష్ట్రం టార్గెట్‌ను మించి విద్యుత్ ఉత్పత్తి చేసిందని జెన్కో సీఈ మంగేశ్ కుమార్ తెలిపారు.
2020 -23 ఆర్థిక సంవత్సరానికి గాను నాగార్జునసాగర్‌లోని తెలంగాణ పరిధిలో జల విద్యుత్ కేంద్రాలలో ప్రధాన జల విద్యుత్ కేంద్రo, ఎడమ కాలువపై ఉన్న జల విద్యుత్ కేంద్రంలో మార్చి 2023 నాటికి 1500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టాల్సి ఉండగా గత సంవత్సరం అక్టోబర్ 14వ తేదీనే టార్గెట్‌ను చేరుకున్నామన్నారు.
బుధవారం నాటికి 2265 మిలియన్ యూనిట్ ఉత్పత్తి సాధించినట్లుగా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మరో 400 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని సాధిస్తామన్నారు. తోటి అధికారులు, సిబ్బంది సహకారంతోనే ఈ టార్గెట్ సాధించామన్నారు.