రేవంత్ రెడ్డి వైపు BRS అటెన్షన్.. ములుగు పోలీసులకు ఫిర్యాదు

భగ్గు మంటున్న బీఆర్ఎస్ నాయకులు ములుగు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నక్సలైట్లతో లోపాయకారి ఒప్పందం పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ నర్సంపేటలో నిరసనలకు పిలుపు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ పేల్చి వేస్తే తప్పేంటీ అంటూ టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ములుగులో మంగళవారం రాత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ కాక పుట్టిస్తున్నాయి. ప్రగతిభవన్ పై చేసిన వ్యాఖ్యలు మాటల మంటలు పుట్టిస్తుండగా… గులాబీ శ్రేణులు నిరసన, ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. […]

రేవంత్ రెడ్డి వైపు BRS అటెన్షన్.. ములుగు పోలీసులకు ఫిర్యాదు
  • భగ్గు మంటున్న బీఆర్ఎస్ నాయకులు
  • ములుగు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
  • నక్సలైట్లతో లోపాయకారి ఒప్పందం
  • పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్
  • నర్సంపేటలో నిరసనలకు పిలుపు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ పేల్చి వేస్తే తప్పేంటీ అంటూ టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ములుగులో మంగళవారం రాత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ కాక పుట్టిస్తున్నాయి. ప్రగతిభవన్ పై చేసిన వ్యాఖ్యలు మాటల మంటలు పుట్టిస్తుండగా… గులాబీ శ్రేణులు నిరసన, ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు సీతక్కను కూడా విమర్శిస్తున్నారు. ప్రగతి భవన్ పై అలా వ్యాఖ్యానించడం ఎలా సమంజసం అంటూ నిలదీస్తున్నారు. పార్టీ నేతలు పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేస్తున్నారు. మరి కొందరు నాయకులు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు పిలుపునిచ్చారు.

  • రేవంత్ రెడ్డి వైపు మారిన అటెన్షన్

రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ..ఈ వ్యాఖ్యలు చేశారా? లేకుంటే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తన వైపు తిప్పుకునేందుకు ప్రగతి భవన్ పై మాట్లాడారా? అనేది పక్కకు పెడితే కాంగ్రెస్ పాదయాత్రల గురించి చర్చ జరుగకుండా చేస్తున్న సందర్భంలో తాజా వ్యాఖ్యల ఫలితంగా సెంటర్ పాయింట్ గా మారుతున్నారు. తన వైపు తిప్పుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించిందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పాదయాత్రపై.. రేవంత్ విమర్శలపై పెద్దగా ప్రతిస్పందించని టిఆర్ఎస్ నాయకులు.. ప్రగతిభవన్ పై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా విరుచుకపడుతున్నారు. అడ్రస్ లేని కాంగ్రెస్‌ను పాతాళంలో పడిపోకుండా చూసుకోవాలని హితవు పలికిన గులాబీ నాయకులు తాజా వ్యాఖ్యలపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎంపీగా ఉంటూ ఎలా అలా వ్యాఖ్యానిస్తారంటూ… పీడీ యాక్ట్ నమోదు చేయాలని తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. నక్సలైట్ల పై నిషేధం చేయించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే నక్సలైట్లను సమర్థిస్తూ మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

  • ములుగులో పోలీసులకు ఫిర్యాదు

ములుగులో పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం నివాసం, కార్యాలయమైన ప్రగతి భవన్ ను డైనమైట్లతో పేల్చివేయాలని నిషేదించబడిన నక్సలైట్లకు బహిరంగ పిలుపును ఇవ్వడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ ములుగు అధ్యక్షుడు బాదం ప్రవీణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కెసిఆర్ ప్రాణానికి హాని చేయడం కోసం నక్సలైట్లతో జరిగిన లోపాయికారి ఒప్పందం, కుట్రలో భాగమనే అనుమానంగా ఉందన్నారు. దీని వెనక మాజీ నక్సలైటైన, స్థానిక ఎమ్మెల్యే సీతక్క మధ్యవర్తిత్వం నెరపినట్లు భావిస్తున్నామనీ, రేవంత్ రెడ్డి మరియు సీతక్క అలియాస్ (అనసూయ) తదితరులపై కుట్ర కేసు నమోదుచేయాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • నర్సంపేటలో నిరసనలకు ఎమ్మెల్యే పిలుపు

టీపీపీసీ ప్రెసిండెంట్ చేసిన వాఖ్యలకు నిరసనగా బుధవారం నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలు, శవయాత్రలు చేపట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒక పార్లమెంట్ సభ్యుడు “ప్రగతి భవన్” ను గ్రానైట్స్ తో పేల్చేయమనటం హేయమైన చర్యగా పేర్కొన్నారు. పీడీ యాక్ట్ క్రింద కేసుపెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. కాంగ్రేస్ పెద్దలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి వాఖ్యలను సమర్థిస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఎంపీగా భర్తరప్ చేసి, ఆ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తన వాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి..లేదంటే నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలు తిరగనివ్వరని ఆయన హెచ్చరించారు.