Revanth Reddy | ప్రగతి భవన్‌ను అంబేద్కర్‌ విజ్ఙాన కేంద్రంగా మారుస్తా: రేవంత్‌రెడ్డి

విధాత: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈ విషయాన్ని తాను గతంలో చెప్పానని, అంబేద్కర్‌ జయంతి సందర్భంగా మరోసారి చెపుతున్నా… తాను ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. శుక్రవారం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా శామీర్‌పేటలోని అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బలహీన వర్గాలకు […]

Revanth Reddy | ప్రగతి భవన్‌ను అంబేద్కర్‌ విజ్ఙాన కేంద్రంగా మారుస్తా: రేవంత్‌రెడ్డి

విధాత: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈ విషయాన్ని తాను గతంలో చెప్పానని, అంబేద్కర్‌ జయంతి సందర్భంగా మరోసారి చెపుతున్నా… తాను ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. శుక్రవారం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా శామీర్‌పేటలోని అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించి అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళతామన్నారు. శామీర్‌పేట్‌లో అంబేద్కర్ భవనానికి నా ఎంపీ నిధుల నుంచి 15 లక్షలు మంజూరు చేస్తానని తెలిపారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు.

భారత దేశానికి గుర్తింపు రావడానికి మహాత్మా గాంధీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇద్దరే కారణమని రేవంత్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. రాష్ట్రపతిగా, లోక్ సభ స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్ పార్టీ దళితులకు అవకాశం కల్పించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలన్నారు. భవిష్యత్‌లో కూడా అంబేద్కర్ స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.