నల్గొండ: గ్రామాల్లో ‘ప్రజా గోస.. బీజేపీ భరోసా యాత్ర’ జోరు

ప్ర‌భుత్వ వైఫల్యాల‌ను వివ‌ర‌స్తూ సాగ‌తున్న యాత్ర‌ విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని గ్రామాల్లో బీజేపీ ప్రజాగోస భరోసా యాత్ర జోరుగా సాగుతుంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గం కన్వీనర్ మాధగోని శ్రీనివాస్ గౌడ్ పార్టీ శ్రేణులతో కలిసి ఆరవ రోజు నల్గొండ మండల పరిధిలోని గ్రామాల్లో యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పార్టీ జెండాల ఆవిష్కరణలు, రచ్చబండ సభలు నిర్వహించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, సాధించిన విజయాలను […]

నల్గొండ: గ్రామాల్లో ‘ప్రజా గోస.. బీజేపీ భరోసా యాత్ర’ జోరు

ప్ర‌భుత్వ వైఫల్యాల‌ను వివ‌ర‌స్తూ సాగ‌తున్న యాత్ర‌

విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని గ్రామాల్లో బీజేపీ ప్రజాగోస భరోసా యాత్ర జోరుగా సాగుతుంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గం కన్వీనర్ మాధగోని శ్రీనివాస్ గౌడ్ పార్టీ శ్రేణులతో కలిసి ఆరవ రోజు నల్గొండ మండల పరిధిలోని గ్రామాల్లో యాత్రను కొనసాగించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో పార్టీ జెండాల ఆవిష్కరణలు, రచ్చబండ సభలు నిర్వహించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, సాధించిన విజయాలను మాదగోని ప్రజలకు వివరించారు. అలాగే రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం సాగిస్తున్న కుటుంబ, అవినీతి పాలనా విధానాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు ఏకరువు పెడుతూ ప్రజాగోస బైక్ యాత్ర సాగించారు.

యాత్ర ఆరవ రోజు నల్లగొండ మండలం నర్సింగ్ భట్ల, చెన్నుగూడెం, దొనకల్ తదితర గ్రామాల మీదుగా సాగింది. స్థానిక మహిళలు, బీజేపీ కార్యకర్తలు మంగళ హారుతులతో యాత్రకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, పోతెపాక సాంబయ్య, శ్రీనివాస్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పాలకు రవి తదితరులు పాల్గొన్నారు.