ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
విధాత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. సైఫ్ ఫోన్లో నుంచి పోలీసులు 17 వాట్సాప్ గ్రూప్ చాట్స్ను పరిశీలించి, అనుషా, భార్గవి, ,LDD+ knockouts వాట్సాప్ గ్రూప్ చాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ప్రీతి, సైఫ్ మధ్య గొడవలు జరిగినట్లు సంచలన విషయాలు బయటకువచ్చాయి. ప్రీతి, సైఫ్ మధ్య జరిగిన రెండు ఘటనల ఆధారంగా ప్రీతిపై […]

విధాత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. సైఫ్ ఫోన్లో నుంచి పోలీసులు 17 వాట్సాప్ గ్రూప్ చాట్స్ను పరిశీలించి, అనుషా, భార్గవి, ,LDD+ knockouts వాట్సాప్ గ్రూప్ చాట్స్ను స్వాధీనం చేసుకున్నారు.
రిమాండ్ రిపోర్ట్‌లో ప్రీతి, సైఫ్ మధ్య గొడవలు జరిగినట్లు సంచలన విషయాలు బయటకువచ్చాయి. ప్రీతి, సైఫ్ మధ్య జరిగిన రెండు ఘటనల ఆధారంగా ప్రీతిపై సైఫ్ కోపం పెంచుకున్నట్లు రిపోర్టులో వెల్లడైంది. డిసెంబర్‌లో ఒక యాక్సిడెట్ కేస్ విషయంలో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడు. ఆ సందర్భంలో ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టును ప్రీతి రాసింది. అయితే ప్రీతి రాసిన ఈ రిపోర్టును వాట్సాప్ గ్రూప్లో పెట్టి సైఫ్ హేళన చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో సమాచారం. రిజర్వేషన్లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ ప్రీతిని సైఫ్ అవమానించినట్లు తెలుస్తోంది.
దీనిపై సైఫ్‌కు మెసేజ్ పెట్టిన ప్రీతి.. తనతో ఏమైనా ప్రాబ్లమా అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏమైనా సమస్య ఉంటే.. హెచ్ఓడీ (HOD)కి చెప్పాలని సైఫ్కు ప్రీతి వార్నింగ్ ఇచ్చింది. దీనితో కోపం పెంచుకున్న సైఫ్.. ప్రీతిని వేధించాలని తన స్నేహితుడు భార్గవ్‌కు సైఫ్ చెప్పినట్టు తెలుస్తోంది.
ఆర్ఐసీయూ (RICU) లో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని అతన్ని సైఫ్ ఆదేశించాడని సమాచారం.ఈ విషయమై గత నెల 21న హెచ్ఓడీ(HOD) నాగార్జునకు ప్రీతి ఫిర్యాదు చేయగా, డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతికి, సైఫ్‌కు వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడినట్లు రిమాండ్ రిపోర్టులో వెలుగు చూసింది.