Manchiryala: రాహుల్ అనర్హత వేటును నిరసిస్తూ ఈనెల 8న సత్యాగ్రహ దీక్ష.. ఏర్పాట్లు పరిశీలించిన ప్రేమసాగర్‌రావు
విధాత: రాహుల్ గాంధీ అనర్హత వేటును నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో ఈ నెల 8 న చేపట్టనున్న సత్యాగ్రహ దీక్ష.. బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు పరిశీలించారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామ శివారులో ఈనెల 8వ తేదీన రాహుల్ గాంధీ అనర్హత వేటును నిరసిస్తూ చేపట్టనున్న సత్యాగ్రహ సంకల్ప దీక్ష బహిరంగ సభ స్థలంను, ఏ.ఐ. సీ.సీ.సభ్యుడు , మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పార్టీ శ్రేణులతో కలిసి […]

విధాత: రాహుల్ గాంధీ అనర్హత వేటును నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో ఈ నెల 8 న చేపట్టనున్న సత్యాగ్రహ దీక్ష.. బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు పరిశీలించారు.
మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామ శివారులో ఈనెల 8వ తేదీన రాహుల్ గాంధీ అనర్హత వేటును నిరసిస్తూ చేపట్టనున్న సత్యాగ్రహ సంకల్ప దీక్ష బహిరంగ సభ స్థలంను, ఏ.ఐ. సీ.సీ.సభ్యుడు , మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. సోమవారం సాయంత్రం ప్రేమ్ సాగర్ రావు బహిరంగ సభను పరిశీలించారు. ఈసందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ….. సభకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, జాతీయ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సీ. వేణుగోపాల్, విశ్రాంత ఐ ఏఎస్ అధికారి కొప్పుల రాజుతో పాటు సోనియాగాంధీ తనయురాలు ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
సభకు మంచిర్యాల నియోజకవర్గం నుంచి లక్ష మంది జనం హాజరవుతారని తెలిపారు. ఈసందర్భంగా నస్పూర్ కు చెందిన ఖలీద్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గా నియమిస్తూ ప్రేమ్ సాగర్ రావు లేఖను అందజేశారు.