26న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఈనెల 30 వరకు రాష్ట్రపతి నిలయంలో విడిది ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎస్ విధాత: శీతాకాల విడిది కోసం రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈనెల30 వరకు ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆమె పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ రాష్ట్ర పతి పర్యటన, విడిది ఏర్పాట్లపై సమీక్ష చేశారు. రాష్ట్ర […]

- ఈనెల 30 వరకు రాష్ట్రపతి నిలయంలో విడిది
- ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎస్
విధాత: శీతాకాల విడిది కోసం రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈనెల30 వరకు ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆమె పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ రాష్ట్ర పతి పర్యటన, విడిది ఏర్పాట్లపై సమీక్ష చేశారు. రాష్ట్ర పతి ముర్ము తన పర్యటనలో భాగంగా రామప్ప, భద్రాచలంను సందర్శిస్తారు. అలాగే నగరంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొంటారు.
రంగారెడ్డి జిల్లా కన్హాశాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు రామచంద్ర మహారాజ్ 150వ జయంతి ఉత్సవాల ను ప్రారంభిస్తారు. దీనికి గుర్తుగా హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్ ప్రచార ఫలకం ఆవిష్కరణలో పాల్గొంటారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
రాష్ట్రపతి శీతాకాల విడిదికి హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలని కోరారు. రాష్టప్రతి మార్గంలో రోడ్డు మరమ్మతులు, బారికేడింగ్ పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు సీఈవోలను ఆదేశించారు.
పోలీసు శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్రపతి నిలయంలో ప్రొటోకాల్ అనుసరించి 24 గంటల పాటు విద్యుత్తు శాఖ, వైద్య బృందాలను నియమించాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి కోరారు.
జనవరి 25 నుంచి ఫిబ్రవరి3 వరకు శ్రీరామచంద్రజీ మహారాజ్ 150వ జయంతి ఉత్సవాలు
2023 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో శ్రీరామచంద్రజీ మహారాజ్ 150వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, ఈ ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుండి నుంచి లక్ష మందికి పైగా యాత్రికులు హాజరవుతారని అంచనా వేస్తున్నామనన్నారు. పెద్ద ఎత్తున యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున ఏవిధమైన లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పలు శాఖల అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.