మ‌నీలాండ‌రింగ్ కేసు.. ప్రియాంక గాంధీకి షాకిచ్చిన ఈడీ

కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది

మ‌నీలాండ‌రింగ్ కేసు.. ప్రియాంక గాంధీకి షాకిచ్చిన ఈడీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నారైకి సంబంధించిన మ‌నీలాండ‌రింగ్ కేసులో ప్రియాంక పేరును ఈడీ ప్ర‌స్తావించింది. ఎన్నారై వ్యాపార‌వేత్త సీపీ థంపి, బ్రిట‌న్ జాతీయుడు సుమిత్ చ‌ద్దాపై న‌మోదైన మ‌నీలాండ‌రింగ్ కేసులో భాగంగా దాఖ‌లు చేసిన చార్జ్‌షీటులో ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భ‌ర్త రాబ‌ర్ట్ వాద్రా పేర్ల‌ను ఈడీ చేర్చింది. అయితే ప్రియాంక‌ను నిందితురాలిగా మాత్రం పేర్కొన‌లేదు. ఇదే చార్జ్‌షీట్‌లో ఆమె భ‌ర్త రాబ‌ర్ట్ వాద్రా పేరును కూడా ఈడీ ప్ర‌స్తావించింది.


అస‌లేం జ‌రిగిందంటే..?


ఢిల్లీకి చెందిన రియ‌ల్ ఎస్టేట్ ఏంజెట్ హెచ్ఎల్ ప‌హ్వా ద్వారా ప్రియాంక గాంధీ భ‌ర్త రాబ‌ర్ట్ వాద్రా 2006లో హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో 40.8 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారు. మ‌ళ్లీ 2010లో అదే భూమిని ప‌హ్వాకు విక్ర‌యించారు. అదే విధంగా 2006లో అమీపూర్‌లో హెచ్ఎల్ పహ్వా ద్వారా.. ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మారు.


అయితే ఈ భూములు, ఇల్లు కొనుగోళ్ల వ్య‌వ‌హారంలో జ‌రిగిన ఆర్థిక లావాదేవీలు అన్నీ విదేశాల నుంచి అక్ర‌మంగా వ‌చ్చాయ‌నేది ఈడీ ఆరోప‌ణ‌. విదేశాల‌కు చెందిన సీసీ థంపి, సుమిత్ చ‌ద్దా ద్వారా ప్రియాంక‌, రాబ‌ర్ట్ వాద్రా భూముల కొనుగోలు ద్వారా మ‌నీలాండ‌రింగ్ పాల్ప‌డ్డార‌ని ఆరోపించింది ఈడీ. దీనికి సంబంధించి మంగ‌ళ‌వారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ రాబ‌ర్ట్ వాద్రా పేరును ఛార్జిషీట్‌లో ప్ర‌స్తావించింది.


ఈ భూముల కొనుగోలు విష‌యంలో జ‌రిగిన ఆర్థిక లావాదేవీలు అన్ని విదేశాల నుంచి వ‌చ్చాయ‌నేది ఈడీ ఆరోప‌ణ‌. విదేశాల‌కు చెందిన సీసీ థంపీ, సుమిత్ చ‌ద్దాల ద్వారా ప్రియాంక‌, రాబ‌ర్ట్ వాద్రా భూముల కొనుగోలు ద్వారా మ‌నీలాండ‌రింగ్‌కు పాల్ప‌డ్డార‌ని ఈడీ ఆరోపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్రియాంక‌, రాబ‌ర్ట్ వాద్రా పేర్ల‌ను ఈడీ త‌న ఛార్జిషీట్‌లో పేర్కొంది. మ‌నీలాండ‌రింగ్ కేసులో డిఫెన్స్ డీల‌ర్, లండ‌న్‌కు చెందిన సంజ‌య్ భండారీ కూడా ప‌రారీలో ఉన్నాడు. ఈడీ, సీబీఐ చేసిన చ‌ట్ట‌ప‌ర‌మైన అభ్య‌ర్థ‌న మేర‌కు బ్రిటీష్ ప్ర‌భుత్వం అత‌న్ని ఇండియాకు అప్ప‌గించేందుకు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఆమోదించింది.


భండారీ త‌న అక్ర‌మార్జ‌న‌తో లండ‌న్‌లో ద‌క్కించుకున్న 12 బ్రియాన్‌స్టోన్ స్క్వేర్ అనే ఇంటికి రాబ‌ర్ట్ వాద్రా మ‌ర‌మ్మ‌తులు చేయించార‌ని, అందులో నివాసం కూడా ఉన్నార‌ని ఈడీ ఆరోపించింది. బ్రిట‌న్‌కు చెందిన సుమిత్ చ‌ద్దా అనే వ్య‌క్తి, వాద్రాకు ఈ వ్య‌వ‌హారంలో స‌హ‌క‌రించార‌ని ఈడీ పేర్కొంది.