మెదక్: పనుల్లో నాణ్యత పాటించాలి: కలెక్టర్ ప్రశాంత్ పాటిల్
విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పక్కన నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ పరిశీలించారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం మంగళవారం జిల్లా కలెక్టర్ సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పక్కన నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలాతామస్, డీఎంఈ రమేష్ రెడ్డి ఆసుపత్రికి తప్పనిసరిగా కావలసిన […]

విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పక్కన నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ పరిశీలించారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం మంగళవారం జిల్లా కలెక్టర్ సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పక్కన నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలాతామస్, డీఎంఈ రమేష్ రెడ్డి ఆసుపత్రికి తప్పనిసరిగా కావలసిన కొన్ని సూచనలు కలెక్టర్ తెలిపారు.
నిర్మాణ ఏజెన్సీ టిఎస్ఎంఎస్ఐడిసి ఇంజనిర్ అధికారులు కలెక్టర్ కి మ్యాప్ ను చుపిస్తు పూర్తిగా వివరించారు. మొత్తం కలియ తిరిగారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టాలని సూచించారు.
అందుకోసం వాహనాల పార్కింగ్ కి స్థలం ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. వాటర్ ఫెసిలిటీ కూడా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కెపాసిటీ ఉండాలని, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లో పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి అన్నింటిని దృష్టిలో ఉంచుకోని ట్రాన్స్ ఫార్మర్ ను అమర్చాలన్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ ను తప్పనిసరిగా నిర్మించాలన్నారు.
మార్చురి, పారామెడికల్, అటెండర్ షెడ్ బిల్డింగ్‌కు సంబంధించి 2 రోజుల్లోగా బ్రీఫ్ చెసి ప్రణాళిక రూపొందించాఅని , పనుల్లో వేగం పెంచాలన్నారు. నిర్ణీత గడువు లోపు నిర్మాణం పూర్తి చేసి అందించాలని ఏజెన్సీలను ఆదేశించారు. అలాగే మంత్రితో శంకుస్థాపన చేయించిన ప్రభుత్వ కేంద్రియ ఔషధ గిడ్డంగి, 50పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాల కాంట్రాక్టు అగ్రిమెంట్ పనులు పూర్తి చేసి నిర్మాణ పనులు మొదలు పెట్టాలన్నారు. కలెక్టర్ వెంట మంత్రి ఓఎస్డీ బాల్ రాజ్, టిఎస్ఎంఎస్ఐడిసి డిఈ విశ్వ ప్రసాద్, ఈఈ శ్రీనివాస్ మరియు మెడికల్ కళాశాల సిబ్బంది ఉన్నారు.
పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం, బెజ్జంకి మండలంలో మన ఊరు మన బడి పథకం కింద కేటాయుంచిన పాఠశాలల హెచ్ ఎం, ఎస్ఎంఎసి చైర్మన్లు, ఎంఈవో, ఎంపిడిఒ, ఎపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఏఈ, డీఈలు మరియు సర్పంచ్, కౌన్సిలర్లు, నిర్మాణ ఏజెన్సీలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మొత్తంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథక పనులు నత్తనడకన సాగుతున్నందున అసహనం వ్యక్తం చేశారు. బెజ్జంకి మండలంలో ఇంకా మెరుగుపర్చుకోవాలి. ఈ పథకంలో ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, మేజర్ మైనర్ (కిటికీలు, డోర్లు, స్లాప్, ఫ్లోర్) రిపేర్లు తప్పనిసరిగా వేగంగా పూర్తి చేసి కలరింగ్‌కు నమోదు చేసుకోవాలి.
ఎన్ఆర్ఈజిఎస్, ఈజీఎస్ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్ షేడ్ పూర్తి చేశాకే మిగతా ప్రహరీ గోడ, అదనపు తరగతి గదులు పూర్తి చెయ్యాలి. ఎంపిడిఓ, ఎంపిఓలు రోజు వారిగా పాఠశాలల్లో జరుగుతున్న ఈజీఎస్ పనులను పర్యవేక్షణ చేసి పూర్తి చేపించాలి. ఇప్పటివరకు అయున పనులకు తప్పనిసరిగా ఎప్టిఓ జనరేట్ చెయ్యాలని ఎఈ లకు తెలిపారు.ఎంఈవో, ఎంపిడిఒ, ఎఈలు సమన్వయంతో పని చెయ్యాలి.
పాఠశాల పేరును స్టిల్స్ కలర్ మాదిరిగా ఉండె బోర్డు తో పాటు పథక అమలు ముందు తర్వాత ఎలా ఉంది అనేది ఫోటోలు తీసి ఆల్బమ్ ఏర్పాటు చేసుకోవాలని హెచ్ ఏం లకి తెలిపారు. మళ్లీ విడత సమావేశం లోపు దాదాపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు