కేసముద్రం మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారంలో రగడ

డోర్నకల్ ఎమ్మెల్యే పోటో లేదనీ రెడ్యానాయక్ అనుచరుల నిరసన ఫొటో పెట్టడంతో నిరసన విరమణ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో అధికార గులాబి పార్టీ మధ్య రగడ జరిగింది. పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తమ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఫోటో లేదంటూ ఆయన అనుచరులు నిరసనకు దిగారు. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ […]

  • By: krs    latest    Mar 27, 2023 8:53 AM IST
కేసముద్రం మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారంలో రగడ
  • డోర్నకల్ ఎమ్మెల్యే పోటో లేదనీ రెడ్యానాయక్ అనుచరుల నిరసన
  • ఫొటో పెట్టడంతో నిరసన విరమణ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో అధికార గులాబి పార్టీ మధ్య రగడ జరిగింది. పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తమ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఫోటో లేదంటూ ఆయన అనుచరులు నిరసనకు దిగారు.

మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కేసముద్రంలో మార్కెట్ ఉండగా మార్కెట్ పరిధిలో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండలాలు కూడా వస్తాయి. దీంతో ఈ కార్యక్రమానికి డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు కూడా హాజరయ్యారు. ప్లెక్సీలో రెడ్యానాయక్ ఫోటో లేకపోవడం గమనించి ఆందోళన చేపట్టారు.

ప్లెక్సీలో తమ నాయకుని ఫోటో పెట్టేంత వరకు కార్యక్రమం జరగనిచ్చేది లేదంటూ పట్టుపట్టారు. పోలీసులు వ్యక్తం చేసుకుని నచ్చచెప్పిన వినలేదు. దీంతో నిర్వాహకులు రెడ్యానాయక్ నిలువెత్తు ఫోటో తెచ్చి ఫ్లెక్సీ పక్కన ఏర్పాటు చేయడంతో ఆయన అనుచరులు శాంతించారు. అనంతరం ప్రమాణస్వీకారం సాఫీగా జరిగింది.