Manipur violence | మోదీ చేత‌కాని త‌నం వ‌ల్లే మ‌ణిపూర్‌లో అరాచ‌కాలు.. రాహుల్ గాంధీ ఫైర్

Rahul Gandhi విధాత‌: మ‌ణిపూర్ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మోదీ మౌనం, చేత‌కాని త‌నం వ‌ల్లే మ‌ణిపూర్‌లో అరాచ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని సీరియ‌స్ అయ్యారు. ప్ర‌తిప‌క్షాల కూటమి మౌనంగా ఉండ‌దు. మ‌ణిపూర్ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటామ‌న్నారు. శాంతి త‌మ ముందున్న ఏకైక మార్గం రాహుల్ త‌న ట్విట్‌లో మండిప‌డ్డారు. ప్ర‌ధానిపై మండిప‌డ్డ క‌పిల్ సిబ‌ల్ మ‌ణిపూర్ ఘ‌ట‌న ఒక్క‌టే కాదు.. ఈ దేశంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా జ‌రుగుతున్నాయని, వీటిని […]

  • By: Somu    latest    Jul 20, 2023 12:51 AM IST
Manipur violence | మోదీ చేత‌కాని త‌నం వ‌ల్లే మ‌ణిపూర్‌లో అరాచ‌కాలు.. రాహుల్ గాంధీ ఫైర్

Rahul Gandhi

విధాత‌: మ‌ణిపూర్ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మోదీ మౌనం, చేత‌కాని త‌నం వ‌ల్లే మ‌ణిపూర్‌లో అరాచ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని సీరియ‌స్ అయ్యారు. ప్ర‌తిప‌క్షాల కూటమి మౌనంగా ఉండ‌దు. మ‌ణిపూర్ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటామ‌న్నారు. శాంతి త‌మ ముందున్న ఏకైక మార్గం రాహుల్ త‌న ట్విట్‌లో మండిప‌డ్డారు.

ప్ర‌ధానిపై మండిప‌డ్డ క‌పిల్ సిబ‌ల్

మ‌ణిపూర్ ఘ‌ట‌న ఒక్క‌టే కాదు.. ఈ దేశంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా జ‌రుగుతున్నాయని, వీటిని చూస్తుంటే త‌ల దించుకోవాల్సి వ‌స్తుంద‌ని రాజ్య‌స‌భ ఎంపీ క‌పిల్ సిబ‌ల్ అన్నారు. మ‌ణిపూర్ ఘ‌ట‌న‌పై సుప్రీంకోర్టు స్పందించిన త‌ర్వాత, ప్ర‌ధాని మోదీ నోరు విప్ప‌డం స‌రికాద‌న్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. బేటీ ప‌డావో.. బేటీ బ‌చావోకు ఏమైంద‌న్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతంటే, కూతుళ్ల‌ను ఎలా ర‌క్షిస్తార‌ని క‌పిల్ సిబ‌ల్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

మ‌ణిపూర్ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం: రంజ‌న్ గోగోయ్

మ‌ణిపూర్‌లో ఇద్ద‌రు మ‌హిళ‌ల్ని న‌గ్నంగా ప‌రేడ్ చేయించిన ఘ‌ట‌న‌పై మాజీ సీజేఐ, రాజ్య‌స‌భ ఎంపీ రంజ‌న్ గ‌గోయ్ స్పందించారు. ఆ ఘ‌ట‌న చాలా బాధాక‌ర‌మ‌ని, అది దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న అని ఆయ‌న అన్నారు. వ‌ర్షాకాల స‌మావేశాల ప్రారంభం నేప‌థ్యంలో ఇవాళ ఆయ‌న పార్ల‌మెంట్‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఖండించిన మ‌హిళా క‌మిష‌న్‌

జాతీయ మ‌హిళా క‌మిష‌న్ కూడా మ‌ణిపూర్ ఘ‌ట‌న‌ను ఖండించింది. న‌గ్నంగా ఊరేగించిన‌ ఘ‌ట‌న‌ను సుమోటోగా స్వీక‌రిస్తున్న‌ట్లు చెప్పింది. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌ణిపూర్ డీజీపీని కోరిన‌ట్లు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ పేర్కొన్న‌ది.

ఈ ఘ‌ట‌న‌కు చెందిన ఓ ప్ర‌ధాన నిందితుడిని అరెస్టు చేశార‌ని ఎన్‌సీడ‌బ్ల్యూ చీఫ్ రేఖా శ‌ర్మ తెలిపారు. ఇవాళ సాయంత్రం వ‌ర‌కు మ‌రికొంద‌ర్ని అదుపులోకి తీసుకోనున్నట్లు వెల్ల‌డించారు. ట్విట్ట‌ర్ సంస్థ‌కు కూడా నోటీసులు ఇచ్చామ‌ని, ఇలాంటి వీడియోల‌ను ఆపేయాల‌ని సూచించామ‌న్నారు.