AICC: రాహుల్‌ అనర్హత వేటు.. దేశ వ్యాప్తంగా మూడంచెల పోరాటం

ముఖ్యనేతలతో కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్న ఏఐసీసీ అత్యవసర సమావేశం విధాత: ఏఐసీసీ(AICC) అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటుపై దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం గెజిట్‌ విడుదలైన తరువాత ఏఐసీసీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge)అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశవ్యాప్తంగా మూడు అంచెల పోరాటం చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పోరాటం చేయడానికి ముఖ్యనేతలతో కమిటీ వేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వీధి పోరాటాలు […]

AICC: రాహుల్‌ అనర్హత వేటు.. దేశ వ్యాప్తంగా మూడంచెల పోరాటం
  • ముఖ్యనేతలతో కమిటీ ఏర్పాటు
  • నిర్ణయం తీసుకున్న ఏఐసీసీ అత్యవసర సమావేశం

విధాత: ఏఐసీసీ(AICC) అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటుపై దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం గెజిట్‌ విడుదలైన తరువాత ఏఐసీసీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge)అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశవ్యాప్తంగా మూడు అంచెల పోరాటం చేయాలని నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా పోరాటం చేయడానికి ముఖ్యనేతలతో కమిటీ వేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వీధి పోరాటాలు చేయాలని, న్యాయ పోరాటం చేయాలని, అలాగే ప్రతిపక్ష నేతలను కలుపుకొని పోరాటం చేయాలని నిర్ణయించింది. ఏఐసీసీ పోరాటం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సమస్యలను కూడా జోడించి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్దమవుతున్నది.

ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ౩ గంటలకు గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌నేతల సమావేశం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మానిక్యం ఠాక్రే అధ్వర్యంలో జరుగుననున్నది. సమావేశంలో రాష్ట్రంలో పోరాటం ఏవిధంగా చేయాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27న హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలు రూపొందించింది.