రకుల్ తమ్ముడి పెళ్లి ప్లాన్ వర్కవుట్ కాలే!
విధాత: టాలీవుడ్‌లోని దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్లో అవకాశాలు రావడం లేదో.. లేదంటే బాలీవుడ్‌కి ఫిక్స్ అయిపోయిందో తెలియదు కానీ.. ప్రస్తుతం సౌత్‌లో రకుల్ హవా తగ్గిందనే చెప్పుకోవాలి. అయితే రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ రూపంలో ఇప్పుడామె మరోసారి వార్తలలో నిలిచారు. అదీ కూడా పెళ్లి వార్తతో. రకుల్ పెళ్లి విషయమై తమ్ముడు అమన్ తాజాగా సోషల్ మీడియాలో […]

విధాత: టాలీవుడ్‌లోని దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్లో అవకాశాలు రావడం లేదో.. లేదంటే బాలీవుడ్‌కి ఫిక్స్ అయిపోయిందో తెలియదు కానీ.. ప్రస్తుతం సౌత్‌లో రకుల్ హవా తగ్గిందనే చెప్పుకోవాలి. అయితే రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ రూపంలో ఇప్పుడామె మరోసారి వార్తలలో నిలిచారు.

అదీ కూడా పెళ్లి వార్తతో. రకుల్ పెళ్లి విషయమై తమ్ముడు అమన్ తాజాగా సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యాడు. దీంతో రకుల్, తన ప్రియుడు జాకీ భగ్నానినీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అనేలా టాక్ వైరల్ అవుతుంది. అయితే తన తమ్ముడు చెప్పిన ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు అనేలా.. ‘‘నా పెళ్లి గురించి అందరికీ స్పష్టత ఇచ్చావు సరే.. నా పెళ్లి గురించి నాకు కూడా కాస్త క్లారిటీ ఇవ్వాలి కదా బ్రో’’ అంటూ తమ్ముడిపై పంచ్ విసిరింది.

ఇన్నాళ్లూగా లేనిది ఒక్కసారిగా వీరిద్దరూ ఇలా కామెంట్స్ చేయడం ఏమిటని అంతా అనుకుంటుండగా.. దానికి కారణం ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా అని తెలుస్తుంది. అమన్ ప్రీత్ సింగ్ హీరోగా నటించిన చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాని కాస్త వార్తలలో ఉంచాలంటే.. ఏదో ఒకటి చేయాలి కదా. తమ్ముడి సినిమాపై కాస్త హైప్ రావాలంటే.. అతను ఏదో విధంగా హైలెట్ అవ్వాలి. అందుకే రకుల్, అమన్ కలిసి ఇలా ప్లాన్ చేసి ఉంటారని అంతా అనుకుంటున్నారు.
ఇక ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినట్లుగా తెలుస్తుంది. రొటీన్ కథ, ఆసక్తికరమైన అంశాలు ఏమీ లేవంటూ.. సినిమా చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రిజల్ట్‌తో రకుల్, అమన్ ప్లాన్ కూడా వర్కవుట్ కాలేదనే చెప్పుకోవచ్చు.