Solar Eclipse | రేపు కనువిందు చేయనున్న ‘హైబ్రిడ్‌’ సూర్యగ్రహణం.. ఇలాంటిది మళ్లీ కనిపించేది 140 సంవత్సరాల తర్వాతే..!

Solar Eclipse | ఈ సంవత్సరం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు కాగా.. మరో రెండు చంద్రగ్రహణాలున్నాయి. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం గురువారం ఏర్పడబోతున్నది. ఉదయం 7.04 గంటలకు మొదలై మధ్యాహ్నం 12.29 గంట వరకు కొనసాగనున్నది. అయితే, ఈ గ్రహణం భారత్‌లో కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పాపువా న్యూ గినియా తదితర దేశాల్లోనే దర్శనమిస్తుందని పేర్కొంది. అయితే, గ్రహణాలు సాధారణమైన విషయమే కానీ, గురువారం […]

Solar Eclipse | రేపు కనువిందు చేయనున్న ‘హైబ్రిడ్‌’ సూర్యగ్రహణం.. ఇలాంటిది మళ్లీ కనిపించేది 140 సంవత్సరాల తర్వాతే..!

Solar Eclipse | ఈ సంవత్సరం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు కాగా.. మరో రెండు చంద్రగ్రహణాలున్నాయి. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం గురువారం ఏర్పడబోతున్నది. ఉదయం 7.04 గంటలకు మొదలై మధ్యాహ్నం 12.29 గంట వరకు కొనసాగనున్నది. అయితే, ఈ గ్రహణం భారత్‌లో కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పాపువా న్యూ గినియా తదితర దేశాల్లోనే దర్శనమిస్తుందని పేర్కొంది. అయితే, గ్రహణాలు సాధారణమైన విషయమే కానీ, గురువారం ఏర్పడబోయే గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉన్నది. ఈ గ్రహణాన్ని హైబ్రిడ్‌ గ్రహణంగా పేర్కొంటున్నారు. ఒకే రోజు మూడు రకాల సూర్యగ్రహణాలు కనిపించనున్నాయి.

ఈ గ్రహణాన్ని నిగలు సూర్యగ్రహణం, శంకర సూర్యగ్రహణం లేదంటే కంకణాకార సూర్యగ్రహణం అని కూడా పిలుస్తుంటారు. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని చంద్రుడు అడ్డుకుంటాడు. చంద్రుడి నీడ భూమి ఉపరితలంపై కదులుతున్నప్పుడు ఈ రకమైన గ్రహణం దర్శనమిస్తున్నది. సంపూర్ణ సూర్యగ్రహణం నుంచి కంకణాకార (రింగ్ ఆకారంలో)కి మారుతుది. చివరిసారిగా 2013లో హైబ్రిడ్ సూర్యగ్రహణం ఏర్పడగా.. మళ్లీ 140 సంవత్సరాల తర్వాత కనిపించనున్నది. మళ్లీ ఇలాంటి గ్రహణం మార్చి, 23, 2164 ఏర్పడనున్నది. ఇక సంపూర్ణ సూర్యగ్రహణం పశ్చిమ ఆస్ట్రేలియాలోని నార్త్ వెస్ట్‌ కేప్‌లో దర్శనమివ్వనున్నది. నాసా, ఆస్ట్రేలియాలోని గ్రావిటీ డిస్కవరీ సెంటర్ అండ్ అబ్జర్వేటరీలు ఈ గ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.