నా ఎలుకను దొంగిలించారు సార్.. ఎఫ్ఐఆర్ నమోదు
విధాత: ఎలుకను దొంగిలించడం ఏంటని అనుకుంటున్నారా..? ఇది నమ్మశక్యంగా లేనప్పటికీ నిజమే. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన ఎలుకను దొంగిలించారంటూ.. ఓ వ్యక్తి పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు. ఈ ఘటన రాజస్థాన్ బాన్స్‌వారా జిల్లాలోని సజ్జన్‌ఘర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పడ్లా వాద్కిహియా గ్రామానికి చెందిన మంగు(62) ఓ ఎలుకను పెంచుకుంటున్నాడు. 700 గ్రాముల బరువున్న తన ఎలుకను గత బుధవారం అర్ధరాత్రి 2 గంటలకు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. […]

విధాత: ఎలుకను దొంగిలించడం ఏంటని అనుకుంటున్నారా..? ఇది నమ్మశక్యంగా లేనప్పటికీ నిజమే. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన ఎలుకను దొంగిలించారంటూ.. ఓ వ్యక్తి పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు. ఈ ఘటన రాజస్థాన్ బాన్స్‌వారా జిల్లాలోని సజ్జన్‌ఘర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పడ్లా వాద్కిహియా గ్రామానికి చెందిన మంగు(62) ఓ ఎలుకను పెంచుకుంటున్నాడు. 700 గ్రాముల బరువున్న తన ఎలుకను గత బుధవారం అర్ధరాత్రి 2 గంటలకు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట పోలీసులు కేసు నమోదు చేయలేదు. మంగు ఒత్తిడిని భరించలేక చివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తన సోదరుడి కుమారులైన సురేశ్, మోహిత్, అరవింద్ కలిసి ఎలుకను దొంగిలించి ఉంటారని ఫిర్యాదులో పేర్కొనడంతో, వారి పేర్లను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ఎలుకను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని, ఓర్వలేకనే వారు దాన్ని దొంగిలించారని మంగు కుమారుడు జీవాల పేర్కొన్నాడు. ఆ ముగ్గురిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.