రెడ్యా నాయక్, కవితలు అవినీతిపరులు?
ఆ కోవకు చెందిన వ్యక్తి శంకర్ నాయక్ వీరందరూ అవినీతి త్వరలో బట్టబయలు చేస్తాం కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, బలరా నాయక్, చెరుకు సుధాకర్ విధాత, ఉమ్మడి ఖమ్మం: మాతృ పార్టీకి ద్రోహం చేసిన నాయకులు, ప్రజా ప్రతితులను వదిలి పెట్టేది లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు బలరాం నాయక్, మల్లు రవి, చెరుకు సుధాకర్‌లు అన్నారు. ఈ మేరకు ఇల్లందు మండలం రాజీవ్ నగర్ తండాలో పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా […]

- ఆ కోవకు చెందిన వ్యక్తి శంకర్ నాయక్
- వీరందరూ అవినీతి త్వరలో బట్టబయలు చేస్తాం
- కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, బలరా నాయక్, చెరుకు సుధాకర్
విధాత, ఉమ్మడి ఖమ్మం: మాతృ పార్టీకి ద్రోహం చేసిన నాయకులు, ప్రజా ప్రతితులను వదిలి పెట్టేది లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు బలరాం నాయక్, మల్లు రవి, చెరుకు సుధాకర్‌లు అన్నారు. ఈ మేరకు ఇల్లందు మండలం రాజీవ్ నగర్ తండాలో పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. తల్లికి ద్రోహం చేసినట్టే మాతృ పార్టీకి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు.
రెడ్యానాయక్, కవిత, శంకర్ నాయకులను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిందన్నారు. అలాంటి మాతృ పార్టీకి ద్రోహం చేసి మరో పార్టీలో చలామణి అవుతున్నారని విమర్శించారు. అంతేకాదు వారి అవినీతి అక్రమాలకు హద్దు లేకుండా పోయిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాలామంది మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి అదే పార్టీని విమర్శించడం దుర్మార్గమైన చర్యని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.