RERA | ఎట్టకేలకు ‘రెరా’ ఏర్పాటు.. చైర్మన్‌గా సత్యనారాయణ
RERA | Telangana | తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరి అథారిటీ(రెరా)RERAని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్, ఇద్దరు సభ్యులతో పూర్తిస్థాయి అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీ శాఖ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఎన్ సత్యనారాయణను రెరా చైర్మన్‌గా నియమించింది ప్రభుత్వం. వాణిజ్య పన్నుల శాఖలో అదనపు కమిషనర్‌గా ఉద్యోగ విరమణ చేసిన లక్ష్మీనారాయణ జన్ను, డైరెక్టర్ అండ్ కంట్రీ ప్లానింగ్ విశ్రాంత డైరెక్టర్ కే శ్రీనివాస్ రావులను […]

RERA | Telangana |
తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరి అథారిటీ(రెరా)RERAని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్, ఇద్దరు సభ్యులతో పూర్తిస్థాయి అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీ శాఖ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఎన్ సత్యనారాయణను రెరా చైర్మన్‌గా నియమించింది ప్రభుత్వం.
వాణిజ్య పన్నుల శాఖలో అదనపు కమిషనర్‌గా ఉద్యోగ విరమణ చేసిన లక్ష్మీనారాయణ జన్ను, డైరెక్టర్ అండ్ కంట్రీ ప్లానింగ్ విశ్రాంత డైరెక్టర్ కే శ్రీనివాస్ రావులను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 5 ఏండ్లు లేదా 65 సంవత్సరాల వరకు.. ఏది ముందైతే అప్పటి వరకు వీరు ఈ పదవుల్లో కొనసాగుతారు.
రాష్ట్రంలో రెరా చట్టం 2017 నుంచి అమల్లోకి వచ్చినా అథారిటీ మాత్రం ఏర్పాటు చేయలేదు. అథారిటీ ఏర్పాటు చేయలేదంటూ 2018 ఆగస్టులో రెరా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీని చైర్మన్‌గా నియమించింది ప్రభుత్వం. ఆయన రిటైర్‌మెంట్ కావడంతో సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్ అదనపు బాధ్యతలు స్వీకరించారు.
సోమేశ్ ఏపీకి బదిలీ కావడంతో.. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి చైర్‌పర్సన్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. తాజాగా కేంద్రం మరో దఫా రాష్ట్రానికి లేఖ రాయడంతో అథారిటీ నియామకానికి వీలుగా ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణకు విధించిన గడువు పొడిగించిన నేపథ్యంలో మార్చి 3 నాటికి 96 మంది దరఖాస్తు చేసుకున్నారు. చైర్మన్ పోస్టు కోసం 37 మంది, సభ్యుల పోస్టులకు 59 మంది దరఖాస్తు చేసుకున్నారు.
మొత్తంగా కే శ్రీనివాస్ రావు సోమవారం సాయంత్రం రెరా కార్యాలయంలో సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక చైర్మన్‌గా నియమితులైన సత్యనారాయణ సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం మున్సిపాలిటీ శాఖ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన పదవీ విరమణకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. తక్షణమే ఉద్యోగానికి రాజీనామా చేసి రెరా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారా..? లేక ఉద్యోగ విరమణ చేసిన తర్వాతేనా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.