రాచకొండలో మెట్ల బావి, శివాలయాన్ని పునరుద్ధరిస్తాం: ఎమ్మెల్యే కూసుకుంట్ల‌

విధాత: రాచకొండలోని మెట్ల బావి, ప్రాచీన శివాలయాన్ని పునరుద్ధరిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. మంగళవారం సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ గుట్టల్లో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జాయింట్ కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అటవీ అధికారి పద్మారాణి పర్యటించారు. 700 సంవత్సరాల క్రితం రాచకొండను రాజధానిగా నిర్మించుకొని పద్మనాయక రాజులు పరిపాలన సాగించారు. అప్పట్లో ప్రజల సౌకర్యార్థం అనేక […]

రాచకొండలో మెట్ల బావి, శివాలయాన్ని పునరుద్ధరిస్తాం: ఎమ్మెల్యే కూసుకుంట్ల‌

విధాత: రాచకొండలోని మెట్ల బావి, ప్రాచీన శివాలయాన్ని పునరుద్ధరిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. మంగళవారం సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ గుట్టల్లో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జాయింట్ కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అటవీ అధికారి పద్మారాణి పర్యటించారు.

700 సంవత్సరాల క్రితం రాచకొండను రాజధానిగా నిర్మించుకొని పద్మనాయక రాజులు పరిపాలన సాగించారు. అప్పట్లో ప్రజల సౌకర్యార్థం అనేక దేవాలయాలు, మెట్ల బావులు, కొలనులు, చెరువులు నిర్మించారు. శతాబ్దాలు గడుస్తుండడంతో నాటి దేవాలయాలు, ఇతర నిర్మాణాలు, మెట్ల బావులు, శిథిలావస్థకు చేరుకున్నాయి.

పురాతన ఆలయాలను, మెట్ల బావులను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టింది. వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామ‌న్నారు. ఈ క్రమంలో రాచకొండలోని మెట్ల బావిని పునరుద్ధరణ అంశం పరిశీలనకు మంగళవారం వారు పర్యటించారు.

మెట్ల బావితోపాటు పక్కనే శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 30 లక్షల రూపాయలతో మెట్ల బావిని త్వరలోనే పునరుద్ధరణ పనులు చేపడతామన్నారు.

పది సంవత్సరాల క్రితం భారీ శివలింగం రాచకొండలో బయటపడిందని, అప్పటినుంచి తాత్కాలికంగా ప్రతిష్టాపన చేసి భారీ శివలింగం వద్ద భక్తులు పూజలు చేస్తున్నారని, శివాలయాన్ని సైతం అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాచకొండను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. పర్యటనలో అటవీ రేంజ్ అధికారి దేవిలాల్, ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్‌చందర్ రెడ్డి, జ‌డ్పీటీసీ వీరమల్ల భానుమతి వెంకటేశం, సింగిల్ విండో చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు దోనూరు జైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మన్నే ఇంద్రసేనారెడ్డి, బాలు నాయక్, ఎంపీడీవో రాములు, రాజప్ప సమితి అధ్యక్ష కార్యదర్శులు బత్తుల కృష్ణ కుమార్, సూరపల్లి వెంకటేశం, సభ్యుడు కడారి అంజిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.