రాహూల్‌తో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి(Video)

విధాత: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను చేపట్టారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 3,500 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 150 రోజుల పాటు రాహుల్ ఈ యాత్రను కొనసాగించ నున్నారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం రాహుల్ గాంధీ […]

  • By: krs    latest    Sep 19, 2022 5:17 PM IST
రాహూల్‌తో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి(Video)

విధాత: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను చేపట్టారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 3,500 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 150 రోజుల పాటు రాహుల్ ఈ యాత్రను కొనసాగించ నున్నారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహూల్‌తో కలిసి చర్చించుకుంటూ పాదయాత్ర కొనసాగించారు.

ఈ సందర్భంగా కన్యాకుమారిలో మొదలైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అశేష జనాభిమానాన్ని చూరగొనడం భారత భవిష్యత్ రాజకీయ మార్పులకు సంకేతం అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేరళలో ఉన్న రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నట్టు ట్వీట్ చేశారు.

త్వరలో తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్ర

రాహుల్ గాంధీ పాటు తెలంగాణలో పాదయాత్ర నిర్వహించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. గతంలో రేవంత్ వంద నియోజక వర్గాల్లో పాదయాత్ర చేయాలనుకున్నారు. అయితే అధిష్టానం నుంచి క్లియరెన్స్ రాలేదు.

అయితే రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి తెలంగాణలో తాను మళ్లీ వేరుగా పాదయాత్ర చేసే అవసరం ఉండకపోవచ్చని.. రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చేయడం ద్వారా తాను కూడా ప్రజల్లోకి వెళ్లినట్టు అవుతుందని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రాహుల్ గాంధీ నిర్ణయం కారణంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్లాన్‌ మారినట్టు అర్థమవుతోంది.