Supreme Court | ఓటుకు నోటు కేసు.. ఆగస్టు 28కి వాయిదా

Supreme Court | Revanth Reddy విధాత: ఓటుకు నోటు కేసులో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు ఆగస్టుకు 28కి వాయిదా వేసింది. రేవంత్ తరపు న్యాయవాదులు కొన్ని అనివార్య కారణాల నేపధ్యంలో కేసు విచారణ వాయిదా వేయాలని సుప్రీంకోర్టుకు లేఖ ద్వారా కోరారు. తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తు రేవంత్ తరుపు లేఖపై తమకు సమాచారం లేదని […]

  • By: Somu    latest    Jul 20, 2023 12:32 AM IST
Supreme Court | ఓటుకు నోటు కేసు.. ఆగస్టు 28కి వాయిదా

Supreme Court | Revanth Reddy

విధాత: ఓటుకు నోటు కేసులో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు ఆగస్టుకు 28కి వాయిదా వేసింది.

రేవంత్ తరపు న్యాయవాదులు కొన్ని అనివార్య కారణాల నేపధ్యంలో కేసు విచారణ వాయిదా వేయాలని సుప్రీంకోర్టుకు లేఖ ద్వారా కోరారు.

తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తు రేవంత్ తరుపు లేఖపై తమకు సమాచారం లేదని కేసు తీవ్రత దృష్ట్యా పిటిషన్ విచారణ వెంటనే చేపట్టాలని కోరారు.

అయితే జస్టిస్ సంజీవ్‌ఖన్నా, బేలా ఎం.త్రివేదిల ధర్మాసనం వారి వాదనను తోసిపుచ్చి కేసు విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది. అయితే మరోసారి వాయిదా కోరవద్దంటు రేవంత్ తరపు న్యాయవాదులకు సూచించింది.