రేవంత్ రెడ్డికి తాతగా ప్రమోషన్..! మనుమడితో ముద్దు మురిపెం!!

విధాత: పీసీసీ చీఫ్ ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి తాత అయ్యాడు. తన ఏకైక కుమార్తె నైమిశా రెడ్డి కుమారుడికి జన్మనిచ్చింది. దీంతో రేవంత్ కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. మనవడు పుట్టాడని తెలుసుకున్న రేవంత్ ఆసుపత్రికి వెళ్లి అతడిని చూసి మురిసిపోయారు. ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. తన చిన్నారి కూతురు నైమిశారెడ్డి గత వారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని, తమ ఇంట మనవడి రాకతో సంతోషం నెలకొందని, మీ అందరి […]

  • By: krs    latest    Apr 09, 2023 10:56 AM IST
రేవంత్ రెడ్డికి తాతగా ప్రమోషన్..! మనుమడితో ముద్దు మురిపెం!!

విధాత: పీసీసీ చీఫ్ ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి తాత అయ్యాడు. తన ఏకైక కుమార్తె నైమిశా రెడ్డి కుమారుడికి జన్మనిచ్చింది. దీంతో రేవంత్ కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. మనవడు పుట్టాడని తెలుసుకున్న రేవంత్ ఆసుపత్రికి వెళ్లి అతడిని చూసి మురిసిపోయారు. ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

తన చిన్నారి కూతురు నైమిశారెడ్డి గత వారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని, తమ ఇంట మనవడి రాకతో సంతోషం నెలకొందని, మీ అందరి ఆశీర్వచనాలు, శుభాకాంక్షలు తల్లి బిడ్డలకు అందించాలని కోరారు.

ట్విట్టర్లో మనవడిని చూసి మురిసిపోతున్న తన ఫోటోలు కూడా రేవంత్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ కు, తల్లి బిడ్డలకు ట్విట్టర్లో పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు కూడా తమ శుభాకాంక్షలు తెలిపారు.