TRS ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక‌.. తీర్పును పునః స‌మీక్షించండి: సుప్రీంకోర్టు

విధాత: TRS ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక‌పై హైకోర్టు సింగిల్ జ‌డ్డి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పునః స‌మీక్షించాల‌న్న‌ది. ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని, కొన్ని విష‌యాలు ప్ర‌స్తావించ‌ లేద‌ని ఆరోపిస్తూ ఆయ‌న ప్ర‌త్య‌ర్థి మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి హైకోర్టులో పిటిష‌న్ వేశారు. మ‌ద‌న్‌మోహ‌న్‌రెడ్డి పిటిష‌న్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు సింగిల్ జ‌డ్డి ఉత్త‌ర్వుల‌ను సుప్రీం కోర్టులో స‌వాల్ చేశారు. సింగిల్ జ‌డ్డి తీర్పుపై పునఃస‌మీక్ష చేయాల‌ని హైకోర్టు సీజేకు సుప్రీంకోర్టు సూచించింది. అక్టోబ‌ర్ […]

  • By: krs    latest    Sep 28, 2022 8:20 AM IST
TRS ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక‌.. తీర్పును పునః స‌మీక్షించండి: సుప్రీంకోర్టు

విధాత: TRS ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక‌పై హైకోర్టు సింగిల్ జ‌డ్డి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పునః స‌మీక్షించాల‌న్న‌ది. ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని, కొన్ని విష‌యాలు ప్ర‌స్తావించ‌ లేద‌ని ఆరోపిస్తూ ఆయ‌న ప్ర‌త్య‌ర్థి మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

మ‌ద‌న్‌మోహ‌న్‌రెడ్డి పిటిష‌న్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు సింగిల్ జ‌డ్డి ఉత్త‌ర్వుల‌ను సుప్రీం కోర్టులో స‌వాల్ చేశారు. సింగిల్ జ‌డ్డి తీర్పుపై పునఃస‌మీక్ష చేయాల‌ని హైకోర్టు సీజేకు సుప్రీంకోర్టు సూచించింది. అక్టోబ‌ర్ 10న వాద ప్ర‌తివాదులు హైకోర్టు సీజే ఎదుట హాజ‌రు కావాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.