రైతులు,కూలీల హక్కులను హరిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

పేద వర్గాలను ఆర్థిక దోపిడికి గురి చేసి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారు. పేపర్ల లీకేజీ పై సమగ్ర దర్యాప్తు జరిపించి, నియామక సంస్థలపై నిరుద్యోగులకు నమ్మకం కల్పించాలి కమ్యూనిస్టులు లేకపోవడం వల్లే చట్టసభల్లో పేదల వ్యతిరేక చట్టాలు రూపుదిద్దుకుంటున్నాయి. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విధాత బ్యూరో, కరీంనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులు, కూలీల హక్కులను హరిస్తూ వస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ […]

రైతులు,కూలీల హక్కులను హరిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
  • పేద వర్గాలను ఆర్థిక దోపిడికి గురి చేసి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారు.
  • పేపర్ల లీకేజీ పై సమగ్ర దర్యాప్తు జరిపించి, నియామక సంస్థలపై నిరుద్యోగులకు నమ్మకం కల్పించాలి
  • కమ్యూనిస్టులు లేకపోవడం వల్లే చట్టసభల్లో పేదల వ్యతిరేక చట్టాలు రూపుదిద్దుకుంటున్నాయి.
  • సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

విధాత బ్యూరో, కరీంనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులు, కూలీల హక్కులను హరిస్తూ వస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో రెండు రోజులపాటు జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత కౌన్సిల్ సమావేశాల ముగింపు సమవేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో వ్యవసాయరంగానికి, వ్యవసాయ అనుబంధ కూలీల హక్కులకు రక్షణ లేకుండా పోతుందని ఆరోపించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) నిధులను కేంద్రం 30 వేల 500 వందల కోట్లకు కుదించిందని, దీన్ని బట్టి చూస్తే ఇది పేదల ప్రభుత్వమా, లేక కార్పొరేట్ల ప్రభుత్వమా? అర్థం కావడం లేదన్నారు.

అట్టడుగు వర్గాల హక్కుల కోసం, వారి రక్షణ కోసం దేశంలో సమాచార హక్కు చట్టం, అటవీ భూముల హక్కుల చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం,రెవెన్యూ చట్టం తీసుకురావడంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైందని ఆయన అన్నారు. వామపక్షాల ప్రతినిధులు చట్టసభల్లో లేకపోవడం మూలంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ అన్యాయం జరిగే చట్టాలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు.

ఒకే దేశం, ఒకే పన్ను పేరుతో పేద ప్రజలపై అనేక భారం మోపుతున్న బిజెపి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు కార్మికులు,కర్షకులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. నీళ్లు,నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు కరువయ్యాయని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన లీకేజీ వ్యవహారం పై సిట్టింగ్ జడ్జి ద్వారా సమగ్ర విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తద్వారా 30 లక్షల మంది నిరుద్యోగులకు నియామక సంస్థలపై నమ్మకాన్ని కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చాడ వెంకటరెడ్డి కోరారు.

రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలందరికీ ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని, రేషన్ కార్డు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలని,ఆర్థికంగా,సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజల్లో చాలా చేతి నిండ పనిలేక తినడానికి తిండి లేక అర్థాకలితో అలాంటిస్తూ దుర్బరమైన జీవితాన్ని గడుపుతున్నందున వారందరిని ప్రభుత్వం వారందరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర విస్తృత కౌన్సిల్ సమావేశాల్లో బి.కె.యం.యు జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గోరియా,జాతీయ కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు టి.వెంకట్రాములు,మోతె లింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కలకొండ కాంతయ్య,నక్క బాల మల్లేష్,సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి,వ్యవసాయ కార్మిక సంఘం ఆఫీస్ బేరర్స్ కొయ్యడ సృజన్ కుమార్,తాటి వెంకటేశ్వర్లు, జంగయ్య,బాపు దుబాసి రాములు,బోయిని అశోక్,కయ్యం సుజాత తదితరులతో పాటు 33 జిల్లాల కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.