నల్గొండ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడిగా చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి

విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: నల్గొండ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ నియామక పత్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన సీఎం కేసీఆర్ కు, మంత్రి జగదీష్ రెడ్డికి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, […]

నల్గొండ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడిగా చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి

విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: నల్గొండ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ నియామక పత్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన సీఎం కేసీఆర్ కు, మంత్రి జగదీష్ రెడ్డికి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి, శాసన సభ్యులు నల్లమోతు భాస్కరరావుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.