జక్రాన్ పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్తో సహా ఇద్దరు మృతి

ఒకరి ప‌రిస్థితి విషమం.. మరో నలుగురికి గాయాలు విధాత, నిజామాబాదు: నిజామాబాదు జిల్లా జక్రాన్ పల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వుండగా మరో నలుగురికి గాయాలయ్యాయి. నిజామాబాదు మండల్ బోర్గం (పి) గ్రామం నుండి వేల్పూర్ మండలం లక్కోరా గ్రామానికి వెళ్తున్న ఆటోను జక్రాన్ పల్లి వద్ద వెనుక నుండి కార్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలు […]

జక్రాన్ పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్తో సహా ఇద్దరు మృతి
  • ఒకరి ప‌రిస్థితి విషమం.. మరో నలుగురికి గాయాలు

విధాత, నిజామాబాదు: నిజామాబాదు జిల్లా జక్రాన్ పల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వుండగా మరో నలుగురికి గాయాలయ్యాయి.

నిజామాబాదు మండల్ బోర్గం (పి) గ్రామం నుండి వేల్పూర్ మండలం లక్కోరా గ్రామానికి వెళ్తున్న ఆటోను జక్రాన్ పల్లి వద్ద వెనుక నుండి కార్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలు కాగా ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు.

ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాదు జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ సుదర్శన్, గంగవ్వ మృతి చెందారు. ఈశ్వరమ్మ పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ సంఘటనతో బోర్గం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆటోలో భజన చేసేందుకు వెళ్తున్నపుడు బాల్కొండ మండలం వన్నెల్ (బి)గ్రామానికి చెందిన కారు ఢీకొట్టింది. జక్రాన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.