Pushpa 2 | ఆర్టీసి బస్సును ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు.. పుష్ప 2 ఆర్టిస్టులకు గాయాలు
విధాత: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఆర్టీసి బస్సును వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న పలువురు పుష్ప 2 (Pushpa 2) మూవీ ఆర్టిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా.. షూటింగ్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ప్రైవేట్ ట్రావెల్స్ లో ఆర్టిస్టులు హైదరాబాద్ వెళుతున్నారు. రోడ్డు పక్కన రిపేర్ నిమిత్తం ఆగిన ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనుక నుండి ఢీ కొట్టింది. ప్రమాదంతో హైద్రాబాద్ - […]

విధాత: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఆర్టీసి బస్సును వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న పలువురు పుష్ప 2 (Pushpa 2) మూవీ ఆర్టిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి.
కాగా.. షూటింగ్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ప్రైవేట్ ట్రావెల్స్ లో ఆర్టిస్టులు హైదరాబాద్ వెళుతున్నారు. రోడ్డు పక్కన రిపేర్ నిమిత్తం ఆగిన ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనుక నుండి ఢీ కొట్టింది. ప్రమాదంతో హైద్రాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.