విద్యార్థినిల ఆత్మహత్యలపై సీఎం స్పందించాలి
భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో పదవ తరగతి విద్యార్థినిలు భవ్య, వైష్ణవిల ఆత్మహత్యలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించకపోవడం విచారకరమని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ అన్నారు.

- బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
విధాత : భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో పదవ తరగతి విద్యార్థినిలు భవ్య, వైష్ణవిల ఆత్మహత్యలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించకపోవడం విచారకరమని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహన్ని ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ భవ్య,వైష్ణవిల కుటుంబ సభ్యులను కలసి వారిని పరామర్శించారు. ఈ ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్ సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం..అసెంబ్లీ సమావేశాలలో అధికార, ప్రతిపక్ష నాయకులు చర్చించకపోవడం దురదృష్టకరమన్నారు.
విద్యార్థినిల ఆత్మహత్యలపై తక్షణమే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బీఎస్పీ డిమాండ్ చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ,ప్రైవేటు విద్యా సంస్థలతోపాటు జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో చదివే విద్యార్థుల కోసం యుద్ద ప్రాతిపదికన సైకాలజిస్ట్ లను/కౌన్సిలర్లను నియమించాలని డిమాండ్ చేశారు.