సీఎంగా సచిన్ ఫైలట్ ఎంపిక?.. నాయకత్వానికి అనేక సంకేతాలు
ఉన్నమాట: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై బీజేపీ చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం చెబుతూనే సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇటీవల కాంగ్రెస్ అనేక పదవులు అనుభవించి, పార్టీని వీడి అధికార బీజేపీ నేతల వాదన వినిపిస్తున్న వారికి పరోక్ష సంకేతాలు పంపుతున్నది. నేతల కంటే పార్టీ ముఖ్యమని తేల్చి చెబుతోంది. కష్టకాలంలో పార్టీ కలిసి పని చేయాలని సూచిస్తున్నది. […]

ఉన్నమాట: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై బీజేపీ చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం చెబుతూనే సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.
ఇటీవల కాంగ్రెస్ అనేక పదవులు అనుభవించి, పార్టీని వీడి అధికార బీజేపీ నేతల వాదన వినిపిస్తున్న వారికి పరోక్ష సంకేతాలు పంపుతున్నది. నేతల కంటే పార్టీ ముఖ్యమని తేల్చి చెబుతోంది. కష్టకాలంలో పార్టీ కలిసి పని చేయాలని సూచిస్తున్నది. కాదు, కూడదు అనే వారిని బుజ్జగిస్తూనే.. అధిష్టానం మాట వినని వారు పార్టీ వీడినా పట్టించుకోవడం లేదు.
ఈ ఏడాది చివర్లలో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకుని రావడం కోసం కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది. ముఖ్యంగా సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించి, పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న యువ నాయకత్వానికి సరైన సమయంలో అవకాశం కల్పించాలని చూస్తున్నది.
ఉదాహరణకు మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా ఉదంతాన్ని పునరావృతం చేయకూడదని భావిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి అశోక్ గెహ్లాట్ పేరు కొంతకాలంగా ప్రముఖంగా వినిపిస్తున్నది. ఆయన స్థానంలో గతంలో హామీ ఇచ్చిన మేరకు రాజస్థాన్ లో సచిన్ పైలట్ సీఎంగా దక్కనున్నట్టు సమాచారం.
సచిన్‌కు సీఎంగా అవకాశం ఇవ్వడం ద్వారా యువ నాయత్వానికి భరోసా ఇవ్వాలని అనుకుంటున్నది.
అంతేకాదు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాదు కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలనే వారి సెటైర్లకు పార్టీలో చేపట్టబోయే చర్యలతోనే గట్టి సమాధానం ఇవ్వాలనుకుంటున్నదని తెలుస్తోంది.