Samantha | చికిత్స కోసం యూఎస్ వెళ్లిన స‌మంత‌.. ఖుషీ ప్ర‌మోష‌న్స్ అన్నింటికి డుమ్మా..!

Samantha | గ‌త కొద్ది రోజులుగా స‌మంత పేరు వార్త‌ల‌లో తెగ నానుతూ ఉంది. ఎప్పుడైతే నాగ చైత‌న్య‌- స‌మంత విడాకులు తీసుకున్నారో అప్పటి నుండి స‌మంత పేరు ఏదో ఒక విధంగా చ‌ర్చ‌కు వ‌స్తుంది. విడాకుల విష‌యంతో కొద్ది రోజులు వార్త‌ల‌లో నిలిచిన స‌మంత త‌న‌కి మ‌యోసైటిస్ అనే వ్యాధి సోకిన‌ట్టు తెలియ‌జేసింది. ఈ విష‌యంలో కూడా స‌మంత పేరు నెట్టింట మారుమ్రోగింది. అయితే ప్ర‌స్తుతం మ‌యోసైటిస్ తో బాధ‌ప‌డుతున్న స‌మంత ఆ మ‌ధ్య విదేశాలకి […]

  • By: sn    latest    Aug 19, 2023 12:05 PM IST
Samantha | చికిత్స కోసం యూఎస్ వెళ్లిన స‌మంత‌.. ఖుషీ ప్ర‌మోష‌న్స్ అన్నింటికి డుమ్మా..!

Samantha |

గ‌త కొద్ది రోజులుగా స‌మంత పేరు వార్త‌ల‌లో తెగ నానుతూ ఉంది. ఎప్పుడైతే నాగ చైత‌న్య‌- స‌మంత విడాకులు తీసుకున్నారో అప్పటి నుండి స‌మంత పేరు ఏదో ఒక విధంగా చ‌ర్చ‌కు వ‌స్తుంది. విడాకుల విష‌యంతో కొద్ది రోజులు వార్త‌ల‌లో నిలిచిన స‌మంత త‌న‌కి మ‌యోసైటిస్ అనే వ్యాధి సోకిన‌ట్టు తెలియ‌జేసింది. ఈ విష‌యంలో కూడా స‌మంత పేరు నెట్టింట మారుమ్రోగింది.

అయితే ప్ర‌స్తుతం మ‌యోసైటిస్ తో బాధ‌ప‌డుతున్న స‌మంత ఆ మ‌ధ్య విదేశాలకి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంది. అయిన‌ప్ప‌టికీ వ్యాధి పూర్తిగా న‌యం కాలేదు. ప్ర‌స్తుతం స‌మంత సహజసిద్ధమైన పద్ధతులు కూడా పాటిస్తూ త్వ‌ర‌గా కోలుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.

అయితే మ‌యెసైటిస్ నుండి తాను కోలుకున్న త‌ర్వాత క‌మిటైన సినిమా షూటింగ్స్ అన్ని కూడా త్వ‌ర‌గా పూర్తి చేసింది. ఇక ఇప్పుడు ఎలాంటి సినిమాలు క‌మిట్ కావ‌డం లేదు. పూర్తిగా కోలుకునే వ‌ర‌కు స‌మంత సినిమాలు చేయ‌ద‌ని తెలుస్తుంది.

అయితే పూర్తి స్థాయి ట్రీట్మెంట్ తీసుకునేందుకు గాను స‌మంత శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్ళింది. ఎయిర్‌పోర్ట్ లో స‌మంత‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. స‌మంత త్వ‌ర‌గా కోలుకొని తిరిగి రావాలని ప్ర‌తి ఒక్క‌రు ప్రార్ధిస్తున్నారు. స‌మంత యూఎస్ లో నెల రోజుల పాటు ఉంటుంద‌ని స‌మాచారం.