Secunderabad Railway Station | ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ను తలదన్నేలా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌..! మీరూ ఓ లుక్కేయండి..!

Secunderabad Railway Station | సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల తరహాలో సకల సదుపాయాలు కల్పించడంతో పాటు అందంగా తీర్చిదిద్దనున్నారు. ప్రయాణికులకు సరికొత్త వసతులు అందుబాటులోకి రానున్నాయి. రూ.719కోట్లతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోనే అత్యుత్తమ రైల్వే స్టేషన్‌గా దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు ప్రకటించి.. భవిష్యత్‌లో అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత […]

Secunderabad Railway Station | ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ను తలదన్నేలా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌..! మీరూ ఓ లుక్కేయండి..!

Secunderabad Railway Station |

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల తరహాలో సకల సదుపాయాలు కల్పించడంతో పాటు అందంగా తీర్చిదిద్దనున్నారు. ప్రయాణికులకు సరికొత్త వసతులు అందుబాటులోకి రానున్నాయి. రూ.719కోట్లతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోనే అత్యుత్తమ రైల్వే స్టేషన్‌గా దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు ప్రకటించి.. భవిష్యత్‌లో అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత రైల్వేస్టేషన్‌ ఎలా ఉండబోతున్నదో చిత్రాలను సైతం విడుదల చేశారు. కాగా, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న పనులను అధికారులు వివరించారు.

ప్రస్తుతం రైల్వేస్టేషన్‌ ఉత్తర, దక్షిణ వైపు ఉన్న భవనాలు ప్రస్తుతం 11,427 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉన్నాయి. అభివృద్ధి పనుల తర్వాత ఉత్తర, దక్షిణ వైపు జీ ప్లస్‌ 3 అంతస్తులతో 37,308 చ.మీ.ల మేర అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న భవనాల విస్తీర్ణం 227శాతం పెరగనున్నది. ప్లాట్‌ఫాంలను నిడివి సైతం పెరుగనున్నది.

ప్రస్తుతం ఒక్కో ప్లాట్‌ఫామ్‌ మీద ఒకే రైలు ఆగుతుండగా.. అభివృద్ధి చేసిన తర్వాత రెండు రైళ్లు ఆగనున్నాయి. రైళ్లు ఎక్కేవారు, దిగేవారు వేర్వేరు మార్గాల్లో వెళ్లడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం అందుతున్న సేవలు మరింత రెట్టింపవనున్నాయి.

మొదటి అంతస్తులో ప్రయాణికులు రైళ్లు ఎక్కేందుకు వీలుగా 24,604 చ.మీ.ల స్థలం అందుబాటులోకి వస్తుంది. రెండో అంతస్తులో రూఫ్‌టాప్‌ ప్లాజా వాణిజ్య సముదాయం ఉంటుంది. ప్లాట్‌ఫామ్‌ల మీద రూఫ్‌ మొత్తం 42,212చ.మీ.ల మేర అందుబాటులోకి రానున్నది.

7.5 మీటర్ల వెడెల్పుతో రెండు పాదచారుల వంతెనలు, 26 లిఫ్టులు, 35 ఎస్కలేటర్లు నిర్మించనున్నారు. ఒకటి నుంచి 10 ప్లాట్‌ఫామ్‌లను కలుపుతూ స్టేషన్‌కు చేరుకునే ప్రయాణికులకు పాదచారుల వంతెన నిర్మాణం కానున్నది. విద్యుత్‌ కోసం 5వేల కేడబ్ల్యూపీ సోలార్‌ పవర్‌ప్లాంటును సైతం ఏర్పాటు చేయనున్నారు. అగ్ని ప్రమాదాలకు తలెత్తకుండా లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

అదే సమయంలో పచ్చదనం, పర్యావరణానికి పెద్దపీట వేస్తున్నారు. దివ్యాంగులు సులభంగా స్టేషన్‌లోకి వెళ్లి, రైళ్లు ఎక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లోపలికి ప్రవేశం, బయటికి వెళ్లే మార్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేయనున్నారు. స్టేషన్‌కు ఉత్తర వైపు బహుళ అంతస్తుల స్థాయిలో, దక్షిణ వైపు అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ సదుపాయం కల్పించనున్నారు.

ఉత్తర, దక్షిణ భవనాల దగ్గర ట్రావెలేటర్‌తో పాటు రెండు నడక మార్గాలను నిర్మించనున్నారు. ఈస్ట్‌, వెస్ట్‌ మెట్రోస్టేషన్లను స్కైవేతో అనుసంధానం చేస్తారు. సికింద్రాబాద్‌ ఈస్ట్‌కు, పాత గాంధీ ఆసుపత్రి మెట్రోస్టేషన్‌కు, రేతిఫైల్‌ బస్టాండ్‌కు చేరుకొనేలా వాక్‌వేలు నిర్మించనున్నారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా ఫొటోలను విడుదల చేశారు. ‘ఈ ముఖ్యమైన మౌలిక సదుపాయాల అప్‌గ్రేడేషన్ ప్రాజెక్ట్ ద్వారా అసంఖ్యాకమైన ప్రజానీకానికి ప్రయోజనం చేకూరుతుంది’ అంటూ ట్వీట్‌ చేశారు.