బైక్ దొంగలకు చుక్కలు చూపించిన సెక్యూరిటీ గార్డు.. వీడియో
విధాత: అది దేశ రాజధాని ఢిల్లీ నగరం.. గోవింద్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలోని ఎవరెస్ట్ అపార్ట్‌మెంట్ వద్దకు నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తాము మున్సిపల్ అధికారులమని అపార్ట్‌మెంట్ వాసులకు చెప్పారు. భవనాన్ని తనిఖీ చేస్తున్నట్లు నటించారు. ఓ కొరియర్ సంస్థకు చెందిన డెలివరీ ఏజెంట్ అప్పుడే బైక్‌ను తీసుకొచ్చి ఆపాడు. బైక్‌కే తాళాలు పెట్టి పార్శిల్‌ను డెలివరీ చేసేందుకు వెళ్లాడు. ఇక ఆ బైక్‌ను గమనించిన, ఆ ఇద్దరు […]

విధాత: అది దేశ రాజధాని ఢిల్లీ నగరం.. గోవింద్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలోని ఎవరెస్ట్ అపార్ట్‌మెంట్ వద్దకు నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తాము మున్సిపల్ అధికారులమని అపార్ట్‌మెంట్ వాసులకు చెప్పారు. భవనాన్ని తనిఖీ చేస్తున్నట్లు నటించారు.
ఓ కొరియర్ సంస్థకు చెందిన డెలివరీ ఏజెంట్ అప్పుడే బైక్‌ను తీసుకొచ్చి ఆపాడు. బైక్‌కే తాళాలు పెట్టి పార్శిల్‌ను డెలివరీ చేసేందుకు వెళ్లాడు. ఇక ఆ బైక్‌ను గమనించిన, ఆ ఇద్దరు దాన్ని దొంగిలించేందుకు ప్లాన్ చేశారు. డెలివరీ ఏజెంట్ కిందకు వస్తుండగా, బైక్‌ను వారిద్దరూ తీసుకొని వేగంగా ముందుకు పోనిచ్చారు.
బాధిత వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో.. గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తమయ్యాడు. గేట్లను మూసేసరికి బైక్.. ఇరుక్కుపోయింది. ఇద్దరూ కింద పడిపోయారు. ఇద్దరిలో ఒకరు పారిపోగా, మరొకరిని స్థానికులు బంధించి, పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బైక్ దొంగలను అడ్డుకునేందుకు సెక్యూరిటీ గార్డ్ చేసిన సాహసాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.